»   »  'బాహుబలి 2' రిలీజ్ పోస్ట్ పోన్ వెనక కారణం కత్రినాకైఫ్?

'బాహుబలి 2' రిలీజ్ పోస్ట్ పోన్ వెనక కారణం కత్రినాకైఫ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని 28, ఏప్రియల్ 2017న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామంటూ రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత కరుణ్ జోహార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని విడుదల చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం ని ఏప్రియల్ 14న మొదట రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ రిలీజ్ డేట్ ని రెండు వారాలు ముందుకు తోయటం వెనక ఏదన్నా స్ట్రాటజీ ఉందా అని మన టాలీవుడ్ ట్రేడ్ లో చర్చలు మొదలయ్యాయి. మీడియాలో వార్తలు బయిలుదేరాయి.


ఈ నేపధ్యంలో ఓ విషయం తవ్వకాల్లో బయిటపడింది. ఈ రిలీజ్ మార్పు వెనక కరుణ్ జోహార్ ఓ వ్యూహాత్మకమైన ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఆ ఎత్తుగడ కత్రినాకైఫ్ కు మేలు చేసేదని చెప్తున్నారు.


Actual Reason behind Baahubali 2 Postpone

బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న...రణవీర్ కపూర్ , కత్రినా కైఫ్ నటించిన 'జాగా జాసూస్' ఏప్రియల్ 7, 2017న విడుదల అవుతోంది.రణవీర్ కపూర్ ..వరసగా నాలుగు డిజాస్టర్స్ వచ్చాయి. కత్రినాకైఫ్ కూడా దాదాపు అదే పరిస్దితిలో ఉంది.


దాంతో కత్రినా కైఫ్, రణబీర్ ఇద్దరూ కూడా తమ చిత్రం రిలీజ్ విషయమై కరుణ్ జోహార్ తో మాట్లాడారు. వారికో ఫెరఫెక్ట్ రిలీజ్ డేట్ కావాలి. భారీ చిత్రాలతో పోటీ ఉండకూడదు. ఈ విషయమై రణవీర్ కపూర్...కరుణ్ జోహార్ తో చర్చించాడని తెలుస్తోంది. బాహుబలి 2 కనుక ముందు అనుకున్నట్లుగా ...ఏప్రియల్ 14న వస్తే...ఖచ్చితంగా జాగా జాసూస్ కు దెబ్బ పడుతుంది. అందుకే కరుణ్ జోహార్ చొరవ తీసుకుని రిలీజ్ డేట్ మార్చాడని తెలుస్తోంది.


అంతేకాకుండా ఏప్రియల్ 14న హాలీవుడ్ మోస్ట్ ఏంటిసిపేటెడ్ ఫిల్మ్ ఫాస్ట్ అండ్ ప్యూరియస్ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే తల అజిత్ చిత్రం తల 57 సైతం అదే తేదీన తమిళంలో విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాల పై హాలీవుడ్ అభిమానులు, అజిత్ అభిమానుల దృష్టి ఉంటుంది. దాంతో బాహుబలిపై ధియోటర్స్ పరంగానే కాక , ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగానూ దెబ్బ పడుతుంది. ఇవన్నీ ఆలోచించే వాయిదా తీర్మానానికి వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Just a few days ago, it was announced 'Baahubali: The Conclusion' will hit screens on 28th April, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu