For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HIT 2 Official Collections: అడివి శేష్ ఊచకోత.. తొలి రోజే అన్ని కోట్లు.. కానీ ఆ రికార్డు మాత్రం!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. మరీ ముఖ్యంగా విలక్షణమైన నటనతో సరికొత్త నేపథ్యం ఉన్న చిత్రాలను చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో ఇప్పుడు 'హిట్ ద సెకెండ్ కేస్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'హిట్ 2' బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దామా!

  సెకెండ్ కేస్ టేకప్ చేసిన కేడీ

  సెకెండ్ కేస్ టేకప్ చేసిన కేడీ

  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'హిట్' మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.

  టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!

   హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

  హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

  అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

  అదిరిపోయే టాక్‌తో సందడి

  అదిరిపోయే టాక్‌తో సందడి

  క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ఆరంభం నుంచే అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికితోడు రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు అన్నీ కళకళలాడిపోయాయి. దీంతో దీనికి భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న టాక్ వినిపించింది.

  నిధి అగర్వాల్ ఎద అందాల ఆరబోత: హద్దు దాటేసి మరీ హాట్ షో

  తొలి రోజు తెలుగులో వసూళ్లు

  తొలి రోజు తెలుగులో వసూళ్లు

  'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 53 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు షేర్, రూ. 6.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 4.03 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 6.43 కోట్లు షేర్‌, రూ. 11.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్

  బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలి?

  బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలి?

  అడివి శేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 6.43 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ 8.57 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

  ఆ రికార్డులు చేరని హిట్ 2

  ఆ రికార్డులు చేరని హిట్ 2

  అడివి శేష్ నటించిన తాజా చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. దీనికి తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. కానీ, అతడి గత చిత్రం 'మేజర్'ను మాత్రం ఇది దాటలేకపోయింది. ఆ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.07 కోట్లు వసూలు చేయగా.. ఇది రూ. 4.03 కోట్లు రాబట్టింది. అలాగే ఓవరాల్‌గా మేజర్‌కు రూ. 7.12 కోట్లు వస్తే.. హిట్ 2కు రూ. 6.43 కోట్లే వచ్చాయి

  English summary
  Young Hero Adivi Sesh Did HIT The Second Case Movie Under Sailesh Kolanu Direction. This Movie Collects Rs 6.43 Crores in Day 1.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X