Don't Miss!
- News
బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Hit 2 Day 1 Collections: 'హిట్ 2'కి తొలి రోజే అన్ని కోట్ల వసూళ్లు!.. త్వరలోనే ఆ టార్గెట్ అందుకోనుందా?
యాక్టింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ తో తనదైన సత్తా చాటుతున్న యంగ్ హీరో అడవి శేష్. క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ 1 సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ శైలేష్ కొలను. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసేందుకు నిర్మాతగా మారాడు నాచురల్ స్టార్ నాని.
ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'హిట్ 2: ది సెకండ్ కేస్'. 2020లో వచ్చిన హిట్ 1కు సీక్వెల్ గా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 2న అనేక అంచనాల నడుమ విడుదలైంది. మరి ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు రాబట్టనుందనే వివరాల్లోకి వెళితే..

ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్..
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో 'హిట్' సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
అడవి శేష్ కెరీర్ లోనే తెలుగులో ఈ సినిమా అత్యధిక స్థాయిలో బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 5 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 2 కోట్లకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తంగా హిట్ 2 సినిమా రూ. 7 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తంగా రూ. 14.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా ఉంటుందని అంచనా.

థియేటర్స్ కౌంట్ ఎలా ఉందంటే..
'హిట్: ద సెకెండ్ కేస్' సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నైజాంలో 210, సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 245 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 550 నుంచి 600 థియేటర్లలో విడుదల అయినట్లు సమాచారం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 950కిపైగా థియేటర్లలో రిలీజ్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

హిట్ 2కి అదిరిపోయిన ఆక్యుపెన్సీ..
అడవి శేష్ హీరోగా నటించిన హిట్ ది సెకండ్ కేస్ సినిమా తొలి రోజు ఆక్యుపెన్సీ అదరగొట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి రోజు ఉదయం 39.48 శాతంగా, మధ్యాహ్నాం 36.60 శాతంగా, సాయంత్రం 44.21 శాతంగా థియేటర్ ఆక్యూపెన్సీ నమోదైంది. అంటే మొత్తంగా 120.29 శాతంగా నమోదైంది. అలాగే హైదరాబాద్ లో 52.33, బెంగళూరులో 17.67, చెన్నై 39.33, ముంబై 11.67 శాతంగా ఆక్యూపెన్సీ నమోదైనట్లు సమాచారం.

తొలి రోజు వచ్చిన కలెక్షన్స్!
బద్దకస్తపు పోలీస్ ఆఫీసర్ గా అడవి శేష్, హీరోయిన్ గా మీనాక్షి చౌదరి జంటగా యాక్ట్ చేసిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ బాగానే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్ లో రూ. 4 కోట్లకు పైగా కలెక్షన్స్ వైపు దూసుకుపోతోందని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.75కోట్లు వచ్చాయట.
మొత్తంగా హిట్ 2 సినిమా దేశవ్యాప్తంగా మొదటి రోజు రూ. 6.50 కోట్లు కలెక్షన్స్ అందుకుందని సమాచారం. దీని ప్రకారం హిట్ 2 సినిమా మొదటి రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.