twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణంగా ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్లు.... (ఏరియా వైజ్ డీటేల్స్)

    By Bojja Kumar
    |

    భారీ అంచనాలతో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబో మూవీ 'అజ్ఞాతవాసి' ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది. సినిమా విడుదల ముందు రూ. 200 కోట్లు వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఉన్న ఈ చిత్రం.... ఇపుడు రూ. 100 కోట్లు కూడా వసూలయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. దారుణమైన పరిస్థితి ఏమిటంటే ఈ చిత్రం ఓవరాల్ రన్ లో రూ. 60 కోట్ల షేర్ కూడా సాధించడం కష్టం అంటున్నారు.

    థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు?

    థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు?

    ‘అజ్ఞాతవాసి' చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లకు అమ్మారు. అంటే సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఉండాలంటే..... 130 కోట్ల షేర్ సాధించాలి. అయితే సినిమా విడుదలైన 6 రోజులైనా షేర్ కలెక్షన్ రూ. 52 కోట్లకు మించలేదు. దీంతో ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పని పరిస్థితి.

    Recommended Video

    అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్‌స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!
    సంక్రాంతి రోజు కూడా ఇలా...

    సంక్రాంతి రోజు కూడా ఇలా...

    సంక్రాంతి పండగ రోజు సెలవు అయినప్పటి తెలుగు రాష్ట్రాలన్నిచోట్లా కలిపి రూ. 2.17 కోట్లు మాత్రమే వసూలు చేసింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    నైజాం ఏరియాలో పరిస్థితి?

    నైజాం ఏరియాలో పరిస్థితి?

    ‘అజ్ఞాతవాసి' సినిమాకు భారీగా నష్టపోయేది నైజాం డిస్ట్రిబ్యూటరే అంటున్నారు. నైజాంలో ఈ చిత్రాన్ని రూ. 25 కోట్ల పై చిలుకు ధరకు అమ్మారు. తొలి 6 రోజుల్లో ఈచిత్రం ఇక్కడ కేవలం రూ. 10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. సంక్రాంతి పండగ సీజన్ కూడా ముగియడంతో ఇకపై వసూళ్లు మరింత పడిపోవడం ఖాయం.

    సీడెడ్

    సీడెడ్

    సీడెడ్ ఏరియాలో ‘అజ్ఞాతవాసి' రైట్స్ రూ. 15 కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే ఇక్కడ తొలి 6 రోజుల్లో కేవలం రూ. 4.75 కోట్లు మాత్రమే వసూలైంది. దీంతో ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా భారీగా నష్టం తప్పేట్లు లేదు.

    నెల్లూరు పరిస్థితి ఇదీ

    నెల్లూరు పరిస్థితి ఇదీ

    ‘అజ్ఞాతవాసి' నెల్లూరు రైట్స్ రూ. 4 కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే తొలి 6 రోజుల్లో ఇక్కడ రూ. 2.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక్కడ కూడా భారీ నష్టమే అంటున్నారు.

    గుంటూరు ఏరియా

    గుంటూరు ఏరియా

    గుంటూరు ఏరియాకు గాను అజ్ఞాతవాసి రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మినట్లు సమాచారం. అయితే ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 4.81 కోట్లు మాత్రమే వసూలైంది.

    కృష్ణ ఏరియా

    కృష్ణ ఏరియా

    కృష్ణ ఏరియా రైట్స్ దాదాపు దాదాపు రూ. 7 కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం. ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 2.8 కోట్లు మాత్రమే వసూలైంది.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి ఏరియా రైట్స్ రూ. 6 కోట్ల పై చిలుకు అమ్మారు. ఇక్కడ అజ్ఞాతవాసి చిత్రం తొలి 6 రోజుల్లో రూ. 4.2 కోట్లు వసూలు చేసింది.

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి ఏరియా రైట్స్ రూ. 7 కోట్ల పైచిలుకు అమ్మారు. అయితే తొలి 6 రోజుల్లో ఇక్కడ ఈ చిత్రం రూ. 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    ఉత్తరాంధ్ర

    ఉత్తరాంధ్ర

    ఉత్తరాంధ్ర ఏరియాలో ‘అజ్ఞాతవాసి' థియేట్రికల్ రైట్స్ రూ. 11 కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే తొలి రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 4.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    ఇప్పటి వరకు మొత్తం ఎంత?

    ఇప్పటి వరకు మొత్తం ఎంత?

    ఇప్పటి వరకు అజ్ఞాతవాసి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 37 కోట్ల షేర్ (రూ. 58.20 గ్రాస్) వసూలు చేసింది. ఓవర్స్, ఇతర రాష్ట్రాలన్నింటితో కలిపితే వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు రూ. 52.50 కోట్ల షేర్ (రూ.85 కోట్ల గ్రాస్) వసూలైంది.

    English summary
    Agnyaathavaas only collects Rs. 52 cr in 6 days. By now, its already evident from trade reports that Pawan Kalyan's "Agnyaathavaasi" is likely to emerge the biggest debacle in Tollywood history. Apparently, the Sankranthi festival holiday on Monday just confirmed the massive failure in offing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X