twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ 'డేవిడ్‌ బిల్లా' ఫైనల్ రిజల్ట్

    By Srikanya
    |

    అజిత్ తాజా చిత్రం 'డేవిడ్‌ బిల్లా'మొన్న శుక్రవారం మంచి ఓపినింగ్స్ తో విడుదలైంది. డబ్బింగ్ చిత్రమైనా ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు,బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే స్ధితిలో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం అందరి అంచనాలనూ తల క్రిందులు చేస్తూ ప్లాప్ గా మిగిలింది. స్టైలిష్ నటన పేరుతో సినిమాను లాజిక్ లు లేకుండా నత్త నడకతో నడిపించటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. గతంలో అజిత్ మంగత్తా మాదిరిగానే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానీ స్ధితి చేరుకుంది.

    ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు తోలేటి చక్రి మాట్లాడుతూ...''గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో లాజిక్‌, నాటకీయత కంటే... కథానాయకుడి భావోద్వేగాలే కీలకం. ప్రతి సన్నివేశం కూడా స్త్టెలిష్‌గా కనిపించాలి. ఆ విషయంలో నేను, మా బృందం విజయం సాధించాం. తొలిసారి కమర్షియల్ విలువలున్న సినిమాకి అర్థమేమిటో నాకు తెలిసింది''అన్నారు .

    అలాగే ''ప్రతి డాన్‌కీ ఓ చరిత్ర ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన చిత్రం 'డేవిడ్‌ బిల్లా'. వాస్తవంగా 'బిల్లా'కి ప్రీక్వెల్‌ చెయ్యాలనే ఆలోచన నాది కాదు. స్వతహాగా అజిత్‌ కోరిక అది. ఆయన ఉద్దేశం నచ్చడంతో కథ సిద్ధం చేసుకొన్నాను. ఒక సామాన్య యువకుడు డాన్‌గా ఎదిగే తీరును ప్రతిబింబిస్తూ... మొదట చేతితో, తర్వాత కత్తితో, చివరికి తుపాకులతో పోరాట సన్నివేశాల్ని తీర్చిదిద్దాం'' అన్నారు.

    ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో నటీనటుల చేతుల్లో కనిపించిన ప్రతి ఆయుధం కూడా నిజమైనదే. అజిత్‌ డూప్‌ లేకుండా చేసిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగులోనూ ఓ సినిమా చెయ్యాలనే ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను. అజిత్ స్టైలిష్ పెర్‌ఫార్మెన్స్, పతాక సన్నివేశాల్లో ఆయన చేసిన ప్రమాదకరమైన ఫీట్స్, జార్జియాలోని అత్యంత శీతల వాతావరణంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి. నిజమైన ఆయుధాలను ఉపయోగించిన జార్జియాలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఎంతో కష్టానికోర్చి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించడం ఆనందంగా ఉంది అన్నారు.

    English summary
    Ajith's new movie David Billa released on 13th of July with flop talk. This movie is the prequel to Billa, which was released a few years ago. Chakri Tholeti (Eenadu Fame) is the director and Yuvan Shankar Raja is composing the music. Parvathi Omankuttan and Bruna Abdullah are the Heroines opposite Ajith.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X