Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Thunivu Bussiness: నాన్ థియేట్రికల్ గానే ఊహించని లాభాలు.. ఆ రూట్లో ఎంత వచ్చాయంటే?
తమిళ సినిమా ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఈ హీరో బయట ప్రపంచంలో ఎక్కువగా హడావిడి లేకుండా కనిపిస్తూ ఉంటాడు. ఇక సినిమాల్లో మాత్రం ఊహించిన స్థాయిలో ఫ్యాన్స్ కు నచ్చే విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అతని నుంచి సంక్రాంతికి రాబోతున్న తునివు సినిమా తెలుగులో కూడా తెగింపు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..
అయితే అజిత్ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే ముందుగా ఈ సినిమా తమిళనాడు హక్కులను దాదాపు 60 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది. నిర్మాతగా సొంతంగా విడుదల చేసుకోకుండా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా థియేటర్లను హక్కులను అమ్మేసినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 3.2 కోట్లకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా తెలుగులో అయితే ఈ స్టార్ హీరోకు పెద్దగా బిజినెస్ అయితే లేదు. చివరగా వచ్చిన వాలిమై సినిమా కూడా దాదాపు ఇదే తరహా రేంజ్ లో బిజినెస్ చేసింది. సంక్రాంతి సీజన్ కావడంతో తప్పకుండా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఓవర్సీస్ లో తునివు థియేట్రికల్ రైట్స్ 15 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన భారతదేశంలో 8.5 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే మొత్తంగా చూసుకుంటే థియేట్రికల్ రైట్స్ 86 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ 86.25 కోట్లు. అందులో తమిళనాడు 60 కోట్లు అందించింది. ఇక నాన్ థియేట్రికల్ గా ఓటీటీ శాటిలైట్ అలాగే హిందీ డబ్బింగ్ ఆడియో రైట్స్ ద్వారా సినిమా 110 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే సినిమాపై పెట్టిన పెట్టుబడితో నిర్మాత సేఫ్ అయినట్లే.