twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుడుకి మళ్ళీ నిరాశే(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    Trisha
    ఈ వారం ఆకాశమంతా, బుద్దిమంతుడు, భీభత్సం, మనోరమ చిత్రాలు రిలీజయ్యాయి. అయితే వీటిలో ఒక్కటి కూడా భాక్సాఫీస్ వద్ద కొద్ది పాటి ప్రభావాన్ని చూపకపోవటం విచారకరం. త్రిష, ప్రకాష్ రాజ్ తండ్రి కూతుళ్లు గా చేసిన ఆకాశమంతా దిల్ రాజు నిర్మాత కావటంతో భారీ ఎత్తున పబ్లిసిటీ చేసారు. కానీ మినిమం ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. తరణ్,శ్రియ నువ్వే..నువ్వే తరహా కథ, కథనాలు ఉండటంతో అంతా పెదవివిరుస్తున్నారు. అలాగే అభినయనానుమ్ అనే తమిళ బిలో యావరేజ్ సినిమా డబ్బింగ్ చేయటంతో ఇది పెద్దగా వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు.

    అలాగే భారీ పబ్లిసిటీతో వచ్చిన మరో డబ్బింగ్ సినిమా బుద్దిమంతుడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా,ఆరు పాత్రలు చేసిన ఈ చిత్రం కూడా బి గ్రేడ్ సినిమాగా మిగిలిపోయింది. ఇక అందరిలో కొద్దో గొప్పో ఆసక్తి రేపిన చిత్రం మనోరమ కూడా అదే ఫ్లాఫ్ బాట పట్టింది. శ్రేయాభిలాషి వంటి సామాజిక సందేశం గల చిత్రం అందించిన దర్శకుడు ఈశ్వరరెడ్డి తదుపరి ప్రయత్నం కావటంతో కొందరి దృష్టిని ఆకర్షించింది. జీ మోషన్ ఫిక్చర్స్ వారు అందించిన ఈ సినిమాలో సందేశం ఎక్కువై కథ బోరై ప్రేక్షకులను భయపెట్టింది. టెర్రరిస్టుని మార్చాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఛార్మి మ్యాజిక్ కూడా పని చేయలేదు.

    ఇక భీభత్సం అమ్మ రాజశేఖర్ కసితో అందిస్తున్న చిత్రమని ప్రచారం చేసారు. అయితే అది ప్రేక్షకులమీద కసి అని అర్ధమై పోయింది. హిందీ హిట్ జానీ గధ్దర్ కి ఫ్రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తన తోటి సినిమాల బాటనే పట్టడం దురదృష్టం. ఇక ఇలా ప్రేక్షకుడు సరదా పడి సినిమా చూడ్డానికి బయిలుదేరి వెళ్ళే వాతావరణం కూడా కనపడటం లేదు. అలాగే అరుంధతి కూడా మెల్లిగా చల్లబడిందని రిపోర్టులు చెప్తున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X