twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Hindi Day 1 Collections రికార్డు సంఖ్య థియేటర్లలో అఖండ.. తొలి రోజు ఎంతంటే?

    |

    నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ చిత్రం అద్బుతమైన విజయాన్ని అందుకొన్నది. 2021 సంవత్సరంలో డిసెంబర్ 21 తేదీన రిలీజైన ఈ చిత్రం అన్నివర్గాలను ఆదుకొన్నది. ఏపీలో తక్కువ టికెట్ రేటుకు కూడా రికార్డు స్థాయిలో కాసుల వర్షం కురిపించింది. బాలకృష్ణ కెరీర్‌‌లోనే రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. అఖండ రిలీజ్ తర్వాత హిందీలోకి డబ్బింగ్ చేసి తాజాగా ఉత్తరాదిలో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, కలెక్షన్ వివరాల్లోకి వెళితే..

     వివాదాల మధ్య అఖండ సినిమా

    వివాదాల మధ్య అఖండ సినిమా


    అఖండ సినిమా రిలీజ్ తర్వాత ఈ మధ్య ఏ సినిమా ఆడని విధంగా ఏకంగా 2 నెలలపాటు అంటే 60 రోజులు ఏపీ, తెలంగాణలో ప్రదర్శించబడింది. రిలీజ్‌కు ముందు ఈ చిత్రం 53 కోట్లకుపైగా ప్రి రీలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి నిరాకరించడం అప్పట్లో వివాదంగా మారింది. అయితే అతి తక్కువ టికెట్ రేట్లతో బాక్సాఫీస్‌ను కుదిపేసింది.

     బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యుత్తమ

    బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యుత్తమ


    అఖండ చిత్రం తెలుగు వెర్షన్ 55 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణలో 63 కోట్లకుపైగా షేర్, 105 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం75 కోట్లకుపైగా షేర్, 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అఖండ విజయాన్ని అందుకొన్నది.

     హిందుత్వ విలువలతో అఖండ

    హిందుత్వ విలువలతో అఖండ


    హిందుత్వ వాదంతో రూపొందిన సినిమాలు ది కాశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ2 ఉత్తరాదిలో భారీగా వసూళ్లను రాబట్టడంతో అఖండ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. శివతత్వం, హిందూ భావజాలంతో రూపొందిన సినిమాను డబ్ చేసి జనవరి 20 తేదీన ఉత్తరాదిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా హిందీ ట్రైలర్ మంచి రెస్సాన్స్ కూడగట్టుకొన్నది.

    500 స్క్రీన్లలో హిందీ అఖండ

    500 స్క్రీన్లలో హిందీ అఖండ


    ఇక అఖండకు మంచి రెస్పాన్స్ కనిపించడంతో ఉత్తరాదిలో భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ముంబైలో 72 థియేటర్లలో, ఢిల్లీలో 163, హైదరాబాద్‌లో 25 స్క్రీన్లు, ఆహ్మాదాబాద్‌లో 49, చండీగఢ్‌లో 30 థియేటర్లు, పూణేలో 19, కోల్‌కతాలో 38, జైపూర్‌లో 27, అజ్మీర్‌లో 3, భోపాల్‌లో 1, సూరత్‌లో 13, లక్నోలో 46, డెహ్రాడూన్‌లో 7 కలిపి మొత్తంగా 506 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

     తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?

    తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?


    ఇక ఉత్తరాదిలో గ్రాండ్‌గా రిలీజైన అఖండ హిందీ వెర్షన్‌కు ఓ మోస్తారు వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ కూడా పెద్దగా కనిపించలేదు. అయితే ఈ సినిమా తొలి రోజు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం వల్ల తొలి రోజు స్పందన తక్కువగానే ఉంది. మౌత్ టాక్ పెరిగితే ఈ సినిమా రానున్న రోజుల్లో భారీగా వసూళ్లు సాధించే అవ

    English summary
    Nandamuri Balakrishna's Akhanda Hindi verison hits the screen in North India. This movie has released over 500 Screens. Here is the day 1 expected collection in north India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X