Don't Miss!
- Sports
PBKS vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ఉతప్పకు మళ్లీ నిరాశే! ధోనీకి 200వ మ్యాచ్!
- News
Tirupati Nagarjuna sagar ఉపఎన్నిక: ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం
- Finance
Citibank Exit: సిటీ బ్యాంకు ఎందుకు మూతబడుతోంది! వీరు కొనుగోలు చేసే ఛాన్స్
- Automobiles
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Wild Dog 6 Days Collections: నాగార్జునకు భారీ షాక్.. దారుణంగా కలెక్షన్లు.. ఒక్క రోజులో అంతొస్తుందా!
చాలా కాలంగా హిట్ లేక సతమతం అవుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. జయాపజయాలతో ఎన్నో సినిమాలు చేసినా అవన్నీ ఆయనకు నిరాశనే మిగిల్చాయి. దీంతో వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. దీంతో ఈ సినిమా టార్గెట్ భారీగానే ఉండిపోయింది. ఆ వివరాలు మీకోసం!

‘వైల్డ్ డాగ్'గా మారిన కింగ్ అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్'. సోలోమన్ అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చాడు.

అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా ‘వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

ఆరో రోజు ఏపీ టీఎస్‌లో ఎంత వసూలు చేసింది?
ఆరో రోజు ‘వైల్డ్ డాగ్' సినిమాకు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. 80 వేలు, వెస్ట్‌లో రూ. 50 వేలు, గుంటూరులో రూ. 70 వేలు, కృష్ణాలో రూ. 70 వేలు, నెల్లూరులో రూ. 30 వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రూ. 8 లక్షలు షేర్‌తో పాటు రూ. 15 లక్షల గ్రాస్ వచ్చింది.

ఐదు రోజులకు కలిపి ఏపీ టీఎస్ కలెక్షన్లు ఎంత?
‘వైల్డ్ డాగ్' మూవీకి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అంతగా రావడం లేదు. దీంతో మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 1.21 కోట్లు, రెండో రోజు రూ. 64 లక్షలు, మూడో రోజు రూ. 60 లక్షలు, నాలుగో రోజు రూ. 27 లక్షలు, ఐదో రోజు కేవలం రూ. 13 లక్షలు, ఆరో రోజు మరీ దారుణంగా రూ. 8 లక్షలతో కలిపి రూ. 2.93 కోట్లు షేర్, రూ. 5.37 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో ‘వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో ఆరు రోజులకు రూ. 2.93 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 27 లక్షలు రాబట్టింది. ఫలితంగా ఆరు రోజులకు రూ. 3.34 కోట్లు షేర్, రూ. 6.42 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?
‘వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజులకు ఈ చిత్రం రూ. 3.34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలి అంటే ఇంకా రూ. 6.06 కోట్లు రాబట్టాల్సి ఉంది. శుక్రవారం ‘వకీల్ సాబ్' విడుదలైతే దీనికి కష్టాలు తప్పవు. సో ఈ ఒక్క రోజే సమయం ఉంది.