Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ. 200కోట్ల దిశగా అక్షయ్ సినిమా.. 13వ రోజూ తగ్గని జోరు
సామాజికి నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించి సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఇటీవలి కాలంలో వరుస విజయాలను అందుకుంటోన్న బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను చేస్తూ.. మంచి సందేశాలను ఇస్తున్నాడు. గతేడాది కేసరి, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లోనటించిన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో వచ్చిన గుడ్ న్యూస్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసి.. ఇంకా వసూళ్ల సునామిని సృష్టిస్తోంది.
దర్శకుడు రాజ్ మెహతా రూపొందించిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గుడ్ న్యూస్ మూవీ వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. విడుదలై రెండు వారాలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. కాగా ఈచిత్రం విడుదలైన 13 రోజులకు గాను 177.31 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ వారాంతానికి గుడ్ న్యూస్ మూవీ 200కోట్ల మార్కు చేరుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన రెండు జంటల విషయంలో జరిగిన పొరపాటు కారణంగా జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ధిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ 2019 ని గుడ్ న్యూస్ విజయంతో ముగించింది. ఇక గత ఏడాది అక్షయ్ నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా అన్ని చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. గతేడాది అక్షయ్ అన్ని సినిమాలు కలిపి దాదాపు 700కోట్లు కొల్లగొట్టినట్టు రిపోర్ట్స్ వచ్చాయి.