Just In
- 2 min ago
A1 Express first Day collections: సందీప్ కిషన్ బాక్సాఫీస్ పోరాటం.. ఇక ఆశలన్నీ ఆదివారంపైనే!
- 37 min ago
జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!
- 1 hr ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 1 hr ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
Don't Miss!
- News
ఒకే ఒక్కడు.!ప్రచారంలో దూకుడు.!ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి.!
- Sports
India vs England: సునీల్ గవాస్కర్ హాఫ్ సెంచరీ.. సత్కరించిన బీసీసీఐ!!
- Automobiles
భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘అల’ 18 days collections: 300 కోట్ల వైపు పరుగు.. బాక్సాఫీస్‌పై తగ్గని స్టైలిష్ స్టార్ దాడి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రిలీజైన అల వైకుంఠపురంలో మూవీ నాలుగో వారంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నది. మూడో వారంలో కూడా వసూళ్ల జోరు తగ్గకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గత 18 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

18వ రోజు కలెక్షన్లు
అల వైకుంఠపురం చిత్రం 18వ రోజున కూడా భారీ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం 18వ రోజున రూ.83 లక్షల వసూళ్లను నమోదు చేసింది. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం దాదాపు రూ.121 కోట్ల షేర్‌ను సాధించింది.

ప్రాంతాల వారీగా కలెక్షన్లు
ఇక ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా 18వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ.43 లక్షలు
సీడెడ్‌లో రూ.7 లక్షలు,
ఉత్తరాంధ్రలో రూ.9 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.4.6 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 లక్షలు
గుంటూరులో రూ.5 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.5.2 లక్షలు
నెల్లూరులో రూ.3 లక్షలు వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం రూ.9.36 కోట్లు రాబట్టింది.

మొత్తం 18 రోజుల వసూళ్లు
అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించి మొత్తంగా 18 రోజుల షేర్ ఇలా ఉంది..
నైజాంలో రూ.40.85 కోట్లు,
సీడెడ్‌లో రూ.17.45 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.18.64 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.10.77 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.8.48 కోట్లు
గుంటూరులో రూ.10.58 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.10.16 కోట్లు
నెల్లూరులో రూ.4.35 కోట్లు
ఏపీ, తెలంగాణాలోని అన్ని ప్రాంతాల కలెక్షన్లు చూస్తే 121.28 కోట్ల షేర్ సాధించింది.

ఇతర రాష్ట్రాల్లో
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను అల వైకుంఠపురంలో నమోదు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.8.90 కోట్లు, కేరళలో రూ.1.2 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.44 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు రాబట్టింది. దాంతో 18వ రోజున రూ.151 కోట్ల షేర్, రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

అల వైకుంఠపురంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.20 కోట్లు,
సీడెడ్‌లో రూ.12 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.8.5 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.30 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు
గుంటూరులో రూ.6.3 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లు
నెల్లూరులో రూ.2.78 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో రూ.65 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ.7.2 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9.8 కోట్లుతో ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ.84.34 కోట్లు రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 70 కోట్లకుపైగా లాభాన్ని డిస్టిబ్యూటర్లకు పంచి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకొన్నది.