Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 1 hr ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
6 days collections: ‘సరిలేరు’ వసూళ్లను బ్రేక్ చేసిన అల వైకుంఠపురంలో.. కుమ్మేస్తున్న అల్లు అర్జున్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్‌ను రఫాడించేస్తున్నాడు. సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం రికార్డులను నెలకొల్పుతూ కాసుల పంటను పండిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

6వ రోజు కలెక్షన్లు
మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడుతూ రిలీజైన అల వైకుంఠపురం తొలి ఆట నుంచే భారీ వసూళ్లను నమోదు చేసింది. తాజాగా 6వ రోజున ఈ చిత్రం రూ.9.36 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల షేర్‌ను సాధించింది.

ప్రాంతాల వారీగా కలెక్షన్లు
ఇక ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా 6వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ.2.7 కోట్లు,
సీడెడ్‌లో రూ.1.46 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.1.86 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.81 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.67 లక్షలు
గుంటూరులో రూ.73 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.82 లక్షలు
నెల్లూరులో రూ.31 లక్షలు వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం రూ.9.36 కోట్లు రాబట్టింది.

మొత్తం 6 రోజుల వసూళ్లు
అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించి మొత్తంగా 6 రోజుల షేర్ ఇలా ఉంది..
నైజాంలో రూ.25.35 కోట్లు,
సీడెడ్‌లో రూ.13 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7.50 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.7 కోట్లు
నెల్లూరులో రూ.3 కోట్లు
ఏపీ, తెలంగాణాలోని అన్ని ప్రాంతాల కలెక్షన్లు చూస్తే 80 కోట్ల షేర్ సాధించింది.

ఇతర రాష్ట్రాల్లో
ఇక తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉండే కర్ణాటకలో కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.6.5 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో రూ.10.5 కోట్లు రాబట్టింది. దాంతో 6వ రోజున రూ.99 కోట్ల షేర్, రూ.159 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

100 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్
ఇదిలా ఉండగా, శనివారం మధ్నాహ్నం అల వైకుంఠపురంలో చిత్రం అల్లు అర్జున్‌కు అరుదైన రికార్డును అందించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ సాధించడంతో తొలిసారి స్టైలిష్ స్టార్ వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. దీంతో అల్లు అర్జున్ స్టామినా బాక్సాఫీస్ వద్ద మరోసారి రుజువైంది. ఏడో రోజున ఈ చిత్రం రూ.104 కోట్లు నమోదు చేయడం గమనార్హం.

అప్పుడే లాభాల్లోకి ప్రవేశించి..
అల వైకుంఠపురంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.20 కోట్లు,
సీడెడ్‌లో రూ.12 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.8.5 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.30 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు
గుంటూరులో రూ.6.3 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లు
నెల్లూరులో రూ.2.78 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో రూ.65 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ.7.2 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9.8 కోట్లుతో ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ.84.34 కోట్లు రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 15 కోట్లకుపైగా లాభాన్ని డిస్టిబ్యూటర్లకు పంచింది.