Just In
- 13 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బన్నీ బాక్సాఫీస్ దాడి.. బ్రేకుల్లేవ్!! 'అల.. వైకుంఠపురములో' 8 డేస్ కలెక్షన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూవీ 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే దూకుడుగా వెలుతూ భారీ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. మరి ఈ 8 రోజుల్లో అల్లు అర్జున్ రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

భారీ రేంజ్‌లో విడుదల.. పాజిటివ్ వైబ్స్
అల వైకుంఠపురములో సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. థమన్ బాణీలు, ఇచ్చిన అప్‌డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, చాలా రోజుల తరువాత అల్లు అర్జున్ సినిమా వస్తుండటం, టీజర్, ట్రైలర్ అన్నీ వర్కౌట్ అయి భారీ రేంజ్‌లో ఈ సినిమా విడుదలైంది.

బాక్సాఫీస్ దాడి.. సంక్రాంతి అడ్వాంటేజ్
అలా విడుదలైందో లేదో.. భారీ కలెక్షన్స్ సాధిస్తూ నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాకు సంక్రాంతి సెలవులు బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఈ మూవీ. అలా సక్సెస్‌ఫుల్ ఫస్ట్ వీక్ పూర్తిచేసిన బన్నీ.. సెకండ్ వీక్ కూడా అదే రేంజ్‌లో స్టార్ట్ చేసేశాడు.

ఆదివారం సెలవు.. 8వ రోజు ఏకంగా
నిన్న (జనవరి 19) ఆదివారం సెలవు కావడంతో అల వైకుంఠపురములో దీన్ని క్యాష్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారమే 84 కోట్ల షేర్ సాధించిన అల వైకుంఠపురములో మూవీ 8వ రోజు ఏకంగా 7.8 కోట్ల షేర్ సాధించి 92 కోట్ల మార్క్ చేరుకుంది.

అల వైకుంఠపురములో 8 డేస్ ఏరియావైజ్ రిపోర్ట్
నైజాంలో 29.87 కోట్లు, సీడెడ్ 13.61 కోట్లు, గుంటూరు 8.83 కోట్లు, ఉత్తరాంధ్ర 13.85 కోట్లు, తూర్పు గోదావరి 8.26 కోట్లు, పశ్చిమ గోదావరి 6.39 కోట్లు, కృష్ణ 8.47 కోట్లు, నెల్లూరు 3.45 కోట్లు.. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 92.73 కోట్లు రాబట్టింది అల వైకుంఠపురములో మూవీ.

అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించింది. చిత్రంలో సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా ఈ సినిమా దూసుకుపోతుండటం విశేషం.