Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'అల.. వైకుంఠపురములో' డే 4 కలెక్షన్స్: స్పీడు పెంచిన పందెం కోడి.. సంక్రాంతి అల్లుళ్లంతా అక్కడే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సెస్‌ఫుల్ కాంబో విజయవంతంగా హాట్రిక్ సాధించింది. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల.. వైకుంఠపురములో' సినిమా పండగ విన్నర్‌గా నిలిచి బన్నీ అభిమానుల్లో జోష్ నింపింది. విడుదలైన మొదటి షో నుంచే వసూళ్ల ప్రవాహం పారిస్తున్న ఈ సినిమా నాలుగో రోజూ అదే హవా కొనసాగించింది. వివరాల్లోకి పోతే..

సంక్రాంతి అల్లుళ్లందరిదీ అదే బాట.. ఒకటే మాట
మొదటి రోజే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కనువిందు చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా 25.56 కోట్ల షేర్ రాబట్టి సక్సెస్ అయింది. ఆ తర్వాత అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ రెండో రోజు, మూడో రోజు సత్తా చాటింది. ఇక నాలుగో రోజుకు వచ్చేసరికి మరింత పుంజుకొని సంక్రాంతి అల్లుళ్లందరినీ థియేటర్స్‌కి రప్పించుకుంది.

'అల.. వైకుంఠపురములో' నాలుగో రోజు.. తెలుగు రాష్ట్రాల్లో
సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో 9.5 నుంచి 12 కోట్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ అందాయి. అంటే మూడో రోజుతో పోల్చితే ఇంకా మెరుగైన వసూళ్లే వచ్చాయని అర్థమవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ టాక్ పెరుగుతుండటం ఈ సినిమాకు బాగా కలిసొస్తుంది.

వరల్డ్‌వైడ్ ఫోర్త్ డే రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లో ‘అల.. వైకుంఠపురములో' మూవీ దుమ్ముదులుపుతోంది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్పీడు పెంచేసింది ఈ సంక్రాంతి పందెంకోడి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే 11 నుంచి 13 కోట్లు వచ్చాయని రిపోర్ట్స్ అందాయి.

ప్రపంచ వ్యాప్తంగా టోటల్ షేర్ ఎలా ఉందంటే..
ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం నాలుగో రోజు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో ‘అల.. వైకుంఠపురములో' మూవీ 56.5 నుంచి 59 కోట్ల షేర్ రాబట్టిందని తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ టోటల్ షేర్ 71 నుంచి 74 కోట్లు అని తెలిసింది.

కలెక్షన్ల సునామీ.. బ్రేక్ ఈవెన్ క్రాస్
సంక్రాతి విన్నర్‌గా నిలిచిన 'అల.. వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్‌లో డే బై డే గ్రోత్ కనిపిస్తోంది. మెల్లగా భారీ రేంజ్ బాక్సాఫీస్ దాడి ప్రారంభించారు అల్లు అర్జున్. దీనికి సంక్రాంతి సెలవులు కూడా కావడం మరింత ప్లస్ అయింది. పరిస్థితి చూస్తూనే మరికొన్ని రోజు 'అల.. వైకుంఠపురములో' కలెక్షన్ల సునామీ ఇలాగే కొనసాగవచ్చని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయనుంది.

'అల.. వైకుంఠపురములో' మూవీ డీటెయిల్స్
గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో 'అల.. వైకుంఠపురములో' మూవీ రూపొందింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.