For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల.. వైకుంఠపురములో డే 1 కలెక్షన్స్.. హౌస్‌‌ఫుల్ బోర్డ్స్‌.. ఊహించిన విధంగానే!

  |

  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో అల్లు అర్జున్ హంగామా స్టార్ట్ అయింది. గత సినిమా జ్ఞాపకాలను చెరిపేస్తూ సూపర్ ఫామ్ లోకి వచ్చేశారు బన్నీ. ఆయన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' తో రికార్డులు తిరగరాయడం ఖాయమని మొదటి రోజే హింట్ ఇచ్చేశారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ రాబట్టింది. వివరాల్లోకి పోతే..

  గట్టి పోటీ ఇస్తూ.. ఫస్ట్ డే జోష్

  గట్టి పోటీ ఇస్తూ.. ఫస్ట్ డే జోష్

  మరోవైపు అంతకుముందే విడుదలైన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో.. ఆ మరుసటి రోజే వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడొచ్చేమో అని కాస్త ఆందోళన చెందారు బన్నీ ఫ్యాన్స్. కానీ అలా కాకుండా ఊహించిన విధంగానే గట్టి పోటీ ఇస్తూ ఫస్ట్ డే అల్లు అర్జున్ సత్తా చాటారు.

  కుమ్మేసిన 'అల.. వైకుంఠపురములో'

  కుమ్మేసిన 'అల.. వైకుంఠపురములో'

  గత సినిమా 'నా పేరు సూర్య' ఫ్లాప్‌ కావడంతో 'అల.. వైకుంఠపురములో' సినిమాపై ముందునుంచే స్పెషల్ కేర్ తీసుకుంటూ వచ్చారు బన్నీ.

  అలాగే ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ బన్నీ అభిమానులకు కావాల్సిన సన్నివేశాలన్నీ మేళవించి ఈ సినిమాకు తెర రూపమిచ్చారు త్రివిక్రమ్. దీంతో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను ఏ మాత్రం వమ్ముచేయకుండా మొదటిరోజే కుమ్మేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.

  హౌస్‌‌ఫుల్ బోర్డ్స్‌.. క్లాస్, మాస్ సెంటర్స్

  హౌస్‌‌ఫుల్ బోర్డ్స్‌.. క్లాస్, మాస్ సెంటర్స్

  రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టిందని తెలుస్తోంది. అన్ని సెంటర్లలో దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోయిందని అంటున్నారు. మార్నింగ్, మాట్నీ షోలతో పోల్చితే ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకూ గ్రోత్ పెరిగింది. క్లాస్, మాస్ అన్ని సెంటర్స్ హౌస్‌‌ఫుల్ బోర్డ్స్‌తో కనిపించాయి.

  ప్రాథమిక రిపోర్ట్స్.. వరల్డ్‌వైడ్ చూస్తే

  ప్రాథమిక రిపోర్ట్స్.. వరల్డ్‌వైడ్ చూస్తే

  ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 19 కోట్లకు పైగా షేర్ అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని అర్థమైంది. అలాగే పూర్తి ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ వివరాలపై క్లారిటీ వస్తే అది కాస్త 20 కోట్లకు చేరుకోవచ్చు. అదే విధంగా వరల్డ్‌వైడ్ చూస్తే మాత్రం ఊహించిన విధంగానే 28 కోట్ల రూపాయలు కలెక్ట్ అయినట్లు ప్రాథమిక రిపోర్ట్స్ చెబుతున్నాయి.

  బన్నీ ఊచకోత, త్రివిక్రమ్ మ్యాజిక్

  బన్నీ ఊచకోత, త్రివిక్రమ్ మ్యాజిక్

  మొదటిరోజే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది బన్నీ ఊచకోత, త్రివిక్రమ్ మ్యాజిక్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు దీనికి సంబంధించిన ఏరియావైజ్ డీటైల్ రిపోర్ట్ చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. కాసేపు ఆగాలి మరి బన్నీ ఏ ఏరియాలో ఎలా దూసుకుపోయాడో తెలియాలంటే!.

  Ala Vaikunthapurramloo US Premiers Crossed 300k
  అల్లు అర్జున్- పూజా హెగ్డే రొమాన్స్

  అల్లు అర్జున్- పూజా హెగ్డే రొమాన్స్

  గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో అల.. వైకుంఠపురములో మూవీ రూపొందింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.

  English summary
  Allu Arjun, Trivikram Srinivas hatric movie Ala vaikunthapurramuloo. This movie released today and getting public talk. As per these talk Day 1 box office collections are.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X