'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ డే అంచనా: కలెక్షన్స్ ఎలా ఉండవచ్చంటే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలా భామ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ (జనవరి 12) ఈ సినిమా విడుదలైంది. ప్రీమియర్స్ ద్వారానే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండవచ్చనే అంచనా బయటకొచ్చింది. ఆ వివరాలు చూద్దామా..

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబో
త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు మంచి డిమాండ్ నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పుడు ప్రీమియర్స్ నుంచి కూడా సూపర్బ్ అనే టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా సంక్రాంతికి కాసులు కురిపించినట్లే అంటున్నారు విశ్లేషకులు.

ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ ఎంత రావచ్చంటే..
ఈ మేరకు మొదటిరోజు 'అల.. వైకుంఠపురములో' ఈ రేంజ్‌లో ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. సినిమా డిమాండ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 45 కోట్లు, షేర్ 28 నుంచి 29 కోట్లుగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ నిపుణుల అంచనా మేరకు సంక్రాంతి రేస్‌లో 'అల.. వైకుంఠపురములో' గట్టిపోటీ ఇచ్చి నిర్మాతలకు లాభాలు తెస్తుందని తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డే1 కలెక్షన్స్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇమేజ్‌ని బట్టి, సినిమా టాక్ ఆధారంగా ఈ సినిమా తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టవచ్చని తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో 6 కోట్లు రావచ్చని, ఇక కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 3 కోట్లమేర కొల్లగొట్టచ్చని ట్రేడ్ పండితుల అంచనా.

ఏరియావైజ్ చూస్తే.. ప్రాథమిక అంచనా
తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైజ్ చూసినట్లయితే.. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.5 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.25 నుంచి 2.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్లు, గుంటూరులో 3 కోట్లు, కృష్ణాలో 1.75 కోట్లు, నెల్లూరులో 1.2 కోట్లు రావచ్చనేది ప్రాథమిక అంచనా.

అల.. వైకుంఠపురములో మూవీ
గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో అల.. వైకుంఠపురములో మూవీ రూపొందింది. ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు. అందరి అభినయం భేష్ అనే టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











