Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెనుకే వచ్చాడు కానీ రేసులో ముందున్నాడు.. ఓవర్సీస్‌లో పోటెత్తుతోన్న ‘అల’
ఓవర్సీస్ మార్కెట్‌లో మొదటి నుంచి మహేష్ బాబు ఆధిపత్యమే కనిపిస్తూ వచ్చేది. బాహుబలి లాంటి కొన్ని సినిమాలను మినహాయిస్తే.. ఓవర్సీస్‌లో మహేష్ బాబును ఢీకొట్టే హీరో లేడు.. చిత్రాలు లేవు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది చిత్రాలు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరుకున్న అరుదైన ట్రాక్ రికార్డ్ సూపర్ స్టార్‌ది. అలాంటి మహేష్ బాబును స్టైలీష్ స్టార్ వెనక్కి నెట్టేయబోతోన్నాడు.

ఓవర్సీస్‌లో మహేష్-అల్లు అర్జున్ పోటాపోటీ..
మహేష్ బాబుకు ఉన్న ఓవర్సీస్ ట్రాక్ రికార్డ్ ఏ ఇతర సౌత్ హీరోకు కూడా లేదు. అయితే ఈ సారి మాత్రం మహేష్ బాబుకు అల్లు అర్జున్ గట్టిపోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకరోజు ముందు రిలీజ్ అయినా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఓ రోజు ఆలస్యంగా వచ్చినా ఓవర్సీస్ లెక్కల్లో మాత్రం పెద్ద తేడా కనిపించడం లేదు.
|
దగ్గరగా వచ్చేసిన అల..
ఒక రోజు ముందుగా రిలీజ్ అయిన ఎడ్వాంటేజ్ ఉంది కాబట్టి మహేష్ సినిమా కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 1.8 మిలియన్ డాలర్లను సరిలేరు కలెక్ట్ చేయగా.. 1.79 మిలియన్ల డాలర్లను అల వైకుంఠపురములో కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
|
ట్రేడ్ అనలిస్ట్ ట్వీట్..
సరిలేరు, అల వైకుంఠపురములో చిత్రాల లెక్కలను ఓ కంట కనిపెడుతున్న ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేస్తూ.. అల వైకుంఠపురములో ఓ రోజు వెనక వచ్చినా కలెక్షన్లో ముందుంది అంటూ పోస్ట్ చేశాడు. అంతే కాకుండా తమిళ ప్రేక్షకులు కూడా ఈ రెండు చిత్రాలనే వీక్షిస్తున్నారని పేర్కొన్నాడు.

ప్లస్ అయిన త్రివిక్రమ్..
త్రివిక్రమ్‌కు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. అక్కడి ప్రేక్షకులకు మాస్ చిత్రాలు నచ్చవు.. కేవలం క్లాస్ మూవీస్‌కే ఓటేస్తారు. దీంతో 'అల వైకుంఠపురములో' సినిమాకు ఆదరణ పెరుగుతూ వస్తోందని తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఓవర్సీస్ వసూళ్లలో ప్రభావం చూపెడుతోందని టాక్. మరి ఫుల్ రన్‌లో ఎవరెంత కొల్లగొడతారో చూడాలి.