twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఫీషియల్ : మెగా హీరోలు అందరూ ఒకే వేదికపై

    By Srikanya
    |

    హైదరాబాద్ : మెగా హీరోలందరూ ఒకే వేదికపై కనపడే సన్నివేసం త్వరలో మనముందుకు రానుంది. తమ కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం' ఆడియో పంక్షన్ కు వీరంతా రానున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా నిర్మాతలు మీడియాకు తెలియచేసారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ నెల 18న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మెగా హీరోలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారు'' అని తెలిపారు. అలాగే...మా టైటిల్‌కి, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. పూర్తి వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కించాం. అద్భుతమైన స్క్రీన్ ప్లే కుదిరింది. సాయిధరమ్‌తేజ్‌ చాలా ఎనర్జటిక్‌గా కనిపిస్తాడు. రెజీనా కొత్తగా కనిపిస్తుంది. జగపతిబాబు కీలకమైన ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేశారు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర గొప్పగా ఉంటుంది అన్నారు.

    All Mega Heroes to attend Pilla Nuvvu Leni Jeevitham Audio

    దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. '' అన్నారు.

    సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఇది నా రెండో సినిమా ఈ సినిమాకు కళ్యాణ్ మామయ్య నటించిన గబ్బర్ సింగ్ లో విజయవంతం అయిన పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట పల్లవిని టైటిల్ గా పెట్టడం సంతోషంగా ఉంది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.ఇక ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇతర పాత్రల్లో చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

    English summary
    Sai Dharam Tej's Pilla Leni Jeevitham audio release will take place on 18th of this month and the entire Mega family is expected to grace the event in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X