»   »  చెత్త సినిమా అన్నా కలెక్షన్స్ చెదరలేదు(ట్రేడ్ టాక్)

చెత్త సినిమా అన్నా కలెక్షన్స్ చెదరలేదు(ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ హీరోగా కామిడీ చిత్రాల దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కత్తి కాంతారావు". కామ్నా జఠ్మలాని హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం చీప్ కామిడీగా, ఇంకా చెప్పాలంటే చెత్త కామిడీగా పేరు తెచ్చుకున్నా బి,సి సెంటర్లలలో కలెక్షన్స్ బాగున్నట్లు సమాచారం. అలాగే మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి వారం ఎ సెంటర్లలోనూ బాగానే వర్కవుట్ అయిందని చెప్తున్నారు. ఇవివి, అల్లరి నరేష్ కాంబినేషన్ అన్నదే ధియోటర్స్ కి జనం లాక్కొచ్చిందని అంటున్నారు.

ఇక అల్లరి రవిబాబు దర్శకత్వంలో రూపొందిన 'మనసారా" చిత్రం కూడా క్రిందటవారమే రిలీజైంది. అయితే ఈ చిత్రం మొదట ఫరవాలేదనిపించుకున్నా తర్వాత ప్లాప్ టాక్ వద్ద సెటిలైంది. కలెక్షన్స్ అయితే మరీ వీక్ గా ఉన్నాయని రెండవ వారానికే చాలా ధియోటర్స్ నుంచి సినిమాని తొలిగించారు. అలాగే ఈ శుక్రవారం వెంకటేష్ నాగవల్లి చిత్రం రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. కన్నడ చిత్రం ఆప్త రక్షక రీమేక్ గా చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ప్రమోషన్ , విజయోత్సవాలు అప్పుడే మొదలెట్టారు. మరో ప్రక్క ఫైటర్స్ గొడవతో మొదలైన టాలీవుడ్ సంక్షోభం రోజు రోజుకీ ముదురుతోందే తప్ప ఓ పరిష్కారం వచ్చే వాతావరణం కనపడటం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu