For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరి నరేష్ ‘సుడిగాడు’ కలెక్షన్స్ (ట్రేడ్ టాక్)

  By Srikanya
  |

  హైదరాబాద్: 'అల్లరి' నరేష్, మోనాల్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. నిర్మించిన 'సుడిగాడు' క్రితం శుక్రవారం విడుదలైంది . ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అల్లరి నరేష్ గత చిత్రాలు దేనికి రానంతగా ఈ చిత్రానికి కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన ఐదు రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్లు కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా నైజాంలో రెండు కోట్ల యాభై లక్షలు రూపాయలు కలెక్టు చేసిందని చెప్తున్నారు. ఇదే రన్ కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్ లోనే పది కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

  ఇక ఈ కలెక్షన్స్ కు ప్రధాన కారణం పబ్లిసిటీ అని తేలుస్తున్నారు. మీడియాలో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ చేయటంలో ట్రైలర్స్,పోస్టర్స్ ప్రధాన పాత్ర పోషించాయి. అందుకు తగ్గట్లుగానే ఓపినింగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు ఈ చిత్రం ఓ రేంజిలో కలెక్షన్స్ రాబట్టింది. కామెడీ చిత్రం కావటం, పెద్ద హీరోలను స్పూఫ్ చేయటం ఈ సినిమాకు కలిసివచ్చింది. తమ హీరోలను ఏ విధంగా స్పూఫ్ చేసారు అన్నది వీక్షించటానికే జనం ఎగబడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు.

  ఈ చిత్రంపై పరిచయమైన మోనాల్ గజ్జర్ మీడియాతో మాట్లాడుతూ...'సుడిగాడు' చిత్రంలో తాను నటించిన పాత్ర అందరికీ నచ్చుతోందని, ముఖ్యంగా మొదటినుండి చివరి దాకా తన నటనలో కనిపించిన స్పార్క్స్ మెచ్చుకుంటూ అనేకమంది మెయిల్స్ పంపిస్తున్నారని, తొడగొట్టే సీన్ అందరికీ నచ్చుతోందని, ఆ సన్నివేశం పండించడానికి తాను దాదాపుగా పది టేకులు తీసుకున్నానని నటి మోనాల్‌గజ్జర్ చెప్పింది. ఇక తాను ఇప్పటివరకూ మూడు చిత్రాల్లో నటించినా ప్రేక్షకుల ముందుకు తొలిసారిగా సుడిగాడు చిత్రం వచ్చిందని, పెద్ద సంస్థ, పెద్ద దర్శకుడితోపాటుగా పెద్ద హీరోతో ఈ చిత్రంలో నటించడం తనకానందాన్నిచ్చిందని, యూనిట్ మొత్తం ఎంతో సహకరించి, చిత్రం పూర్తయ్యేంతవరకు పనిచేశారని తెలిపింది.

  'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఆ క్రేజ్ తో ఓవర్ సీస్ బిజినెస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో ఇంతవరకూ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. నలభై ఐదు లక్షలకు ఈ చిత్రాన్ని అమ్మినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్,వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.

  English summary
  Allari Naresh was given the tag of 'Sudigadu' film has collected about Rs 7 Crores in just 5 days worldwide. It also posted a massive figure of Rs 2.50 Crores in Nizam area. Till now, Allari Naresh is treated as a star with just about Rs 10 Crores business range. But Sudigadu would change it. Going by the current run, the film would easily collect such amount by the end of first week itself.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X