twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa 4 Days Collections: నాలుగో రోజూ తెగ్గేదేలే...పుష్ప సంచలన కలెక్షన్లు!

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గతంలో 'ఆర్య', 'ఆర్య2' వంటి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు 'పుష్ప' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ నాలుగు రోజుల కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

    ‘పుష్ప రాజ్'గా

    ‘పుష్ప రాజ్'గా

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ రూపొందించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ లాంటి ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 101.75 కోట్లు, కర్ణాటకకు రూ. 9 కోట్లు, తమిళనాడుకు రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు బిజినెస్ జరిగింది.

    నాలుగో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    నాలుగో రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    'పుష్ప' మూవీకి ఏపీ, తెలంగాణలో నాలుగో రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 3.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 37లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 6.92 కోట్లు షేర్, రూ.11.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    4 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    4 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    'పుష్ప'కు నాలుగు రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ.29.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.15 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.47 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.92 కోట్లు, గుంటూరులో రూ. 3.83 కోట్లు, కృష్ణాలో రూ. 3.09 కోట్లు, నెల్లూరులో రూ. 2.21 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 59.90 కోట్లు షేర్, రూ. 89.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత?

    రెండు రోజుల్లో 'పుష్ప' మూవీకి కర్నాటకలో రూ. 7.85 కోట్లు, తమిళనాడులో రూ.5.74 కోట్లు, కేరళలో రూ. 2.81 కోట్లు, హిందీలో రూ. 7.52 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.72 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 94.44 కోట్లు షేర్‌తో పాటు రూ. 162 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

    బ్రేక్ ఈవెన్ కోసం ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ కోసం ఎంత రావాలి?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.44 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 51.56 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

    English summary
    Tollywood Star Hero Allu Arjun Sukumar's pushpa collected 94.44 Crores in four Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X