twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే..?

    |

    స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మొత్తానికి పుష్ప సినిమాతో ఒక పాన్ ఇండియా మార్కెట్ అయితే సెట్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు. రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ తర్వాత అత్యధిక పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోగా అల్లుఅర్జున్ భవిష్యత్తులో చక్రం తిప్పుతాడు అని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బన్నీ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 60 కోట్ల మార్కెట్ ఉందని చాలా ఈజీ గా అర్థమైంది.

    పరిస్థితులు బాగుంటే ఆ సంఖ్య కూడా మరింత పెరిగి ఉండేది అని అంచనాలు వేస్తున్నారు. అయితే బన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఇటీవల చాలా ఆఫర్స్ రాగా ఒకదాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అల్లు అర్జున్ పుష్ప అనంతరం తన పారితోషికాన్ని కూడా పెంచినట్లు సమాచారం.

    పుష్ప రాజ్ పాత్రతో..

    పుష్ప రాజ్ పాత్రతో..

    అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక మంచి పాయింట్ మాత్రం హైలెట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అని మరోసారి రుజువయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో బన్నీ పూర్తిగా తన స్టైల్ ను పక్కన పెట్టేసి సరికొత్త అవతారం చూపించాడు. పుష్ప రాజ్ పాత్రతో బన్నీ సినిమా మొత్తం లో అందరి కంటే ఎక్కువ స్థాయిలో ఆకట్టుకున్నాడు.

     15వ రోజు కూడా..

    15వ రోజు కూడా..

    అల్లు అర్జున్ హిందీలో ఆ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడు అని మొదట ఎవరు అనుకో లేదు. అసలు పుష్ప సినిమా హిందీ లో విడుదల అవుతుంది అని రిలీజ్ కు ముందు రోజు వరకు కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే చిత్ర యూనిట్ సభ్యులు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు.

    అయినప్పటికీ కూడా మెల్లగా పుష్పరాజ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాడు. 15వ రోజు కూడా సినిమాకు ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయంటే బన్నీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకర్షించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    టార్గెట్ 100కోట్ల మార్కెట్?

    టార్గెట్ 100కోట్ల మార్కెట్?

    మొత్తానికి అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒక మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు అని క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక భవిష్యత్తులో కూడా అక్కడ మరిన్ని మంచి సినిమాలతో 100 కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటాడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

     బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ

    బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ

    ప్రస్తుతం బన్నీ కి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల ఒక కథ పై చర్చలు జరిపిన అల్లు అర్జున్ అది తన మనసుకు నచ్చకపోవడంతో వెంటనే దర్శకనిర్మాతలకు నచ్చలేదు అని చెప్పేశాడట. ఒక మంచి కథ ఉంటే చెప్పండి అని కూడా వారితో సన్నిహితంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

    రెమ్యునరేషన్ డోస్ పెంచిన బన్నీ

    రెమ్యునరేషన్ డోస్ పెంచిన బన్నీ

    ఇక పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడంతో బన్నీ కూడా తన పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది. సినిమాకు అల్లు అర్జున్ 40 కోట్ల వరకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే తర్వాత రాబోయే సినిమాలకు మాత్రం అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉందట. మళ్లీ భవిష్యత్తు సినిమాలకు దాదాపు 60 కోట్లకు పైగానే పారితోషకాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    చేతిలో ఎన్ని సినిమాలంటే?

    చేతిలో ఎన్ని సినిమాలంటే?

    ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఐకాన్ సినిమాతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇటీవల సందీప్ రెడ్డి వంగా తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో బన్నీ పుష్ప రెండో భాగం షూటింగ్ కూడా పూర్తి చేయనున్నాడు.

    English summary
    Allu arjun rejected first bollywood offer and feature remuneration..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X