»   » లాక్ చేసారు: అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం టైటిల్...రిలీజ్ డేట్

లాక్ చేసారు: అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం టైటిల్...రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రం హోలీ సందర్బంగా ఈ రోజు ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. ఆడియో లాంచ్ ని మార్చి 15 న శిల్పా కళా వేదికలో జరగనుంది. ఈ మేరకు ప్రెస్ రిలీజ్ చేసారు. సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో.. కన్నడ నటుడు ఉపేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ మేరకు

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘జులాయి'తో అదిరిపోయే పాటలను అందించిన దేవీశ్రీ ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్‌ అందించాడని చిత్రబృందం అంటున్నారు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి' మ్యూజికల్‌ హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు. ఈ చిత్రం మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allu Arjun's Film Title & Release Date locked!

నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ ‘‘బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌తో సినిమా రూపొందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌ అభినయం సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌. త్వరలో పాటలను విడుదల చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

సింధు తులాని, వెన్నెల కిశోర్‌, బ్రహ్మానందం, రావు రమేశ్‌, ఎమ్మెస్‌ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి. ప్రసాద్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్‌.

English summary
'S/O Satyamurthy' has been confirmed as the title of Allu Arjun-Trivikram's upcoming movie. Makers have released a press note in this regard.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu