Pushpa 45 days collections.. హిందీలో 100 కోట్ల క్లబ్‌లో.. బాహుబలి రికార్డుపై కన్నేసిన పుష్ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. తెలుగు, రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో థియేట్రికల్ రన్‌ను ముగించినట్టు కనిపించినా.. ఉత్తరాదిలో ప్రతికూలతలను ఎదురిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. తాజాగా ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా దక్షిణాది సినిమాల పరంగా ఓ రికార్డును నమోదు చేసింది. పుష్ప సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

దేశవ్యాప్తంగా పుష్పకు ఆదరణ
పుష్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్ చేయడానికి కూడా సమయం లేని పరిస్థితుల్లో థియేటర్లలో పుష్ప రిలీజైంది. ఆ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఆదరించడం చూసి ట్రేడ్ వర్గాలు నివ్వెరపోయారు.

45 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో
పుష్ప మూవీ రిలీజై ప్రస్తుతం 45 రోజుల పూర్తి చేసుకొన్నది. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లూ రికార్డులను క్రియేట్ చేసింది. 45 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 85.35 కోట్లు నికరంగా, 133.25 కోట్లు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇక నైజాంలో 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టంది. ఏపీలో 45 కోట్లు వసూలు చేసింది.

45 రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా
పుష్ప సినిమా ప్రభంజనం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ రాష్ట్రాల్లో కలెక్షన్లను కుమ్మేసింది. ఇక ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 14.56 కోట్లు రాబట్టంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 180.09 కోట్లు, 3548 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డును క్రియేట్ చేసింది.

పుష్ప హిందీ వెర్షన్ కుమ్ముడు..
పుష్ప హిందీ వెర్షన్ రిలీజ్ విషయానికి వస్తే.. ఎలాంటి ప్రమోషన్ లేకుండా బాక్సాఫీస్ బరిలోకి దూకింది. తొలి రోజు నుంచే ఉత్తమ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వైపు కరోనావైరస్ పరిస్థితులు, లాక్‌డౌన్లు, కర్ఫ్యూలను పట్టించుకోకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఆరో వారంలో 6.25 కోట్లు రాబట్టింది. అలాగే ఏడో వారంలో మూడు రోజులకే 2.45 కోట్లు రాబట్టింది. దీంతో హిందీ వెర్షన్ పుష్ప చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

బాహుబలి రికార్డుపై కన్నేసిన పుష్ప
ఇక ఉత్తరాదిలో ఇప్పటి వరకు దక్షిణాది నుంచి విడుదలైన డబ్బింగ్ సినిమా కలెక్షన్ల విషయంలో బాహుబలిపై ఓ రికార్డు ఉంది. బాహుబలి చిత్రం హిందీ వెర్షన్‌లో 117 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి రికార్డుకు పుష్ప చేరువైంది. పుష్ప చిత్రం 103 కోట్ల వసూలు చేసింది. ఇకాం 14 కోట్లు వసూలు చేస్తే బాహుబలి రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
Recommended Video

ప్రభాస్, రజనీకాంత్ సరసన అల్లు అర్జున్
బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన తెలుగు హీరోల్లో ప్రభాస్, రజనీకాంత్ ఉన్నారు. బాహుబలి, సాహో సినిమాతో ప్రభాస్ మూడుసార్లు 100 కోట్ల క్లబ్‌లో చేరగా, రజనీకాంత్ రోబో 2 చిత్రంతో 100 కోట్లు వసూలు చేశాడు. ప్రస్తుతం పుష్ప చిత్రం కూడా 100 కోట్లు రాబట్టడంతో ప్రభాస్, రజనీకాంత్ సరసన అల్లు అర్జున్ కూడా 100 కోట్ల హీరో అయ్యాడు.


Click it and Unblock the Notifications











