»   » ఇదిగో సాక్ష్యం: బెల్లంకొండ, నాగ చైతన్య కలిసి బన్ని కి సాయం

ఇదిగో సాక్ష్యం: బెల్లంకొండ, నాగ చైతన్య కలిసి బన్ని కి సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా టాక్ వేరు..కలెక్షన్స్ రావటం వేరు. ముఖ్యంగా కలెక్షన్స్ కు ప్రక్క సినిమాల పొజీషన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలాంటి మిరాకిల్ అల్లు అర్జున్ తాజా చిత్రం సత్యమూర్తికి కలిసి వస్తోంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బెల్లంకొండ సురేష్, నాగ చైతన్య ల వల్ల కలిసి వస్తోందంటున్నారు.

డ్రాప్ అనుకున్న ఈ చిత్రం మళ్లీ ఈ వీకెండ్ పుంజుకుని అన్ని చోట్లా స్టడీ అయ్యి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దానికి తోడు గంగ(కాంచన 2) రాకపోవటం, దోచెయ్ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటం తో స్టడీగా నడుస్తోంది. అంతేకాదు ఆల్ టైమ్ హైయిస్ట్ గ్రాసింగ్ తెలుగు చిత్రాలలో 10 వ స్ధానం సంపాదించింది. అల్లు అర్జున్ తన రెండు చిత్రాలు ..రేసు గుర్రం Rs 57.65 కోట్లు... సత్యమూర్తిలు Rs 46.95 కోట్లు ...లతో టాప్ రికార్డ్ 10 లలో నిలబడ్డాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' 18 రోజుల క్రితం ( ఏప్రిల్ 9న)ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ లు , ఎ సెంటర్లలలో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. అయితే బి,సి సెంటర్లలలో మాత్రం డ్రాప్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Allu Arjun's S/o Satyamurthy 18 Days Collections

సన్నాఫ్ సత్యమూర్తి 18 రోజలు కలెక్షన్స్ :

నైజాం: రూ 12.95 కోట్లు

సీడెడ్: రూ 5.84 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ 3.68 కోట్లు

గుంటూరు: రూ 2.94 కోట్లు

కృష్ణా: రూ 2.33 కోట్లు

తూర్పు గోదావరి : రూ 2.55 కోట్లు

పశ్చిమ గోదావరి:రూ 2.17 కోట్లు

నెల్లూరు: రూ 1.26 కోట్లు

సన్నాఫ్ సత్యమూర్తి ఎపి & నైజాం 11 రోజుల కలెక్షన్స్: Rs 33.72 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల కలెక్షన్స్: Rs 46.92 కోట్లు (కర్ణాటక: Rs 4.90 కోట్లు; భారత్ లో మిగిలిన ప్రాంతాలు: Rs 1.35 కోట్లు; ఓవర్ సీస్: Rs 5.95 కోట్లు, కేరళ : రూ 0.45 కలిపి)

అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.

విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.

త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్‌లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్‌ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్‌ని తీసుకొచ్చాడని చెబుతున్నారు.

ఇప్పుడీ చిత్రం మళయాళ వెర్షన్ ...ఏప్రియల్ 24న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మళయాళ వెర్షన్ కు చెందిన పోస్టర్స్ ,ప్రోమోలుతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఉంది. బిజినెస్ కూడా బాగా జరిగినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారీగానే మళయాళంలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి కేరళ భాక్సాఫీస్ వద్ద పరిస్దితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ నిత్యామీనన్ ఉండటం కూడా ప్లస్ అవుతుంది.

English summary
S/o Satyamurthy Worldwide 18 Days Collections: Rs 46.92 Crore (includes Karnataka: Rs 5.45 crore; Rest Of India: Rs 1.35 crore; Overseas: Rs 5.95 crore Kerala: Rs 0.45 crore)
Please Wait while comments are loading...