»   » అల్లు శిరీష్ పంట పండింది.. రిలీజ్‌కు ముందే కోట్లు.. అల్లు అర్జున్ క్రేజ్‌ అంటే అది..

అల్లు శిరీష్ పంట పండింది.. రిలీజ్‌కు ముందే కోట్లు.. అల్లు అర్జున్ క్రేజ్‌ అంటే అది..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హిందీలో డబ్బింగ్ అవుతున్న టాలీవుడ్‌ చిత్రాలకు ఉత్తరాదిలో భారీ క్రేజ్ పెరుగుతున్నది. అటు శాటిలైట్‌పరంగా, ఇటు డిజిటల్ పరంగాను మంచి రెస్పాన్స్‌ను టాలీవుడ్ చిత్రాలు రాబట్టుకొంటున్నాయి. అంతేకాకుండా య్యూట్యూబ్‌లో భారీగా రెవెన్యూను సొంతం చేసుకోవడంతో ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ చిత్రానికి భారీ మొత్తంలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్లు కురిపించిందంటే..

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్

  ప్రస్తుతం హిందీ భాషలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం రికార్డుల తిరగరాస్తున్నది. యూట్యూబ్‌లో ఒకే సింగిల్ ఛానెల్‌లో అత్యధిక వ్యూస్ వచ్చిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఒకే ఛానెల్‌లో 81 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషంగా మారింది. అలాగే సరైనోడు చిత్రం ఓవరాల్‌గా డిజిటల్ ప్లాట్‌ఫాంపై 200 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది.

  రిలీజ్‌కు ముందే కోట్ల వర్షం

  రిలీజ్‌కు ముందే కోట్ల వర్షం

  టాలీవుడ్ సినిమాలకు ఇలా క్రేజ్ పెరగడం అల్లు శిరీష్‌కు కలిసి వచ్చింది. అల్లు శిరీష్ నటిస్తు్న ఏబీసిడీ (అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేసీ) అనే చిత్రం షూటింగ్ దశలో ఉండగానే భారీగా బిజినెస్ జరిగింది. సరైనోడు సినిమా హక్కులను సొంత చేసుకొన్న గోల్డ్ మైన్ స్టార్స్ అనే కంపెనీ రూ.2.5 కోట్లు చెల్లించి ఏబీసీడీ హక్కులను సొంతం చేసుకొన్నది.

  ప్లాప్ సినిమానే ఇష్టమంటున్న అల్లు శిరీష్.. అన్నయ్యకు అప్పటి నుంచే అభిమానిగా!

  అల్లు అర్జున్ వల్లనే బిజినెస్

  అల్లు అర్జున్ వల్లనే బిజినెస్

  గతంలో సరైనోడు, డీజే, ఎవడు, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇద్దరు అమ్మాయిలతో, హ్యాపీ, పరుగు లాంటి చిత్రాల హక్కులను గోల్డ్ మైన్ టెలిఫిలింస్ సంస్థ సొంతం చేసుకొన్నది. అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌తోనే శిరీష్ సినిమా హక్కులను భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

  మలయాళ రీమేక్‌తో

  మలయాళ రీమేక్‌తో

  ఏబీసిడీ (అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేసీ) చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏడీసీడీ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ రూపొందిస్తున్నారు.

  English summary
  The trend now continues with the Allu Sirish’ ABCD (American Born Confused Desi). It has got good buzz among the trade circles. This film is a remake of super hit Malayali entertainer ABCD. Gold Mine Stars which previously acquired Sarainodu acquired satellite and digital rights of Allu Sirish's ABCD for a whopping INR 2.5 Cores. Manish Shah, the promoter director and chairman of the Gold Mine Telefilms informed he previously bought dubbing rights for Sarainodu, DJ, Yevadu, Julayi, S/O Sathyamurthy, Iddarammailatho, Happy, Parugu and other super hit Telugu films.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more