»   » “అల్లుడు శ్రీను” ఓవర్ సీస్ కలెక్షన్స్ పరిస్ధితి

“అల్లుడు శ్రీను” ఓవర్ సీస్ కలెక్షన్స్ పరిస్ధితి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం 'అల్లుడుశీను' . వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం నాడు విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇక్కడ ఆంధ్ర,తెలంగాణాలో ఓకే అనిపించుకున్నా...అమెరికాలో దారుణంగా విఫలమైందని సమాచారం. ఓపినింగ్స్ సైతం అక్కడ తెచ్చుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


అందిన సమాచారం ప్రకారం... అక్కడ తొలిరోజు... ఈ చిత్రం కేవలం $ 18,947 వచ్చాయి. శని,ఆదివారాలు కలిపి $ 50,439 కలెక్టు చేసింది. ఇలాగే డల్ గా రన్ ఉంటే...కేవలం $ 1,00,000 సంపాదిస్తుందని అంటున్నారు. అంటే ఓవర్ సీస్ లో ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచినట్లే అని చెప్పాలి.

ఇక్కడ మనకి సైతం ఈ చిత్రం మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ మూట కట్టుకుంది. కథ,కథనం సరిగ్గా లేవంటూ అన్ని చోట్ల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఈ చిత్రం నిర్మాత దాన్ని నివారించటానికి డ్యామేజ్ కంట్రోలు కోసం కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నట్లు చెప్తున్నారు.

బ్రహ్మీ కామెడీతో, తమన్నా ఐటంతో కూడిన కొత్త ప్రోమోలు కట్ చేయటం, సూపర్ హిట్ అయ్యిందని పోస్టర్ వదలటం,ఇప్పటికి ఇంత వసూలు చేసిందంటూ ప్రకటనలు మీడియాకి ఇవ్వటం, ప్రేక్షకులుకు ధాంక్స్ అంటూ ఇంటర్వూలు వంటివి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే టాక్ తేడాగా ఉన్నా కలెక్షన్స్ మాత్రం డ్రాప్ కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వీకెండ్స్ కాకుండా రేపటి నుంచి(సోమవారం)నుంచి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయం సినీ వర్గాల్లో ఆసక్తిగా ఉంది.

 “Alludu Seenu” bombs in America


ఇక ఓ కొత్త హీరో చిత్రానికి కావాల్సిన హుంగుల్ని డిజైన్ చేయడంలో దర్శకుడు వీవీ వినాయక్ సఫలమయ్యాడు కాని.. కథలో పస లేకపోవడం, కథనం పేలవంగా ఉండటం మైనస్ పాయింట్స్ గా మారాయి. సెకండాఫ్ లో ఓ రొటీన్ సీన్లు విసుగు పుట్టించాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో కొంత వేగం పెంచినా.. చివర్లో మళ్లీ కథ మొదటికివచ్చింది. శ్రీనివాస్ లో ఉన్న జోష్, మంచి ఈజ్ కు ఓ వైవిధ్యమున్న కథ తోడైతే.. సూపర్ హిట్ సాధించే ఛాన్స్ ఉండేది. రొటిన్ కథ, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో పర్వాలేదనిపించే 'అల్లుడు శీను' చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశంపైనే విజయం ఆధారపడిఉంది అంటున్నారు.

ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

English summary

 According to reports,“Alludu Seenu” movie made just $ 18,947 on Friday and by Sunday only collected $ 50,439. The movie is expected to collect only $ 1,00,000 or less in the coming days in the overseas market which makes it a flop there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu