twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫైనల్ కలెక్షన్స్... నష్టం ఎంతో తెలుసా?

    |

    రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' తొలి షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్‌తోనే ప్లాప్ అని తేలిపోయింది.

    ఆదరణ లేక పోవడంతో ఇప్పటికే చాలా చోట్ల సినిమాను లేపేశారు. ఈ మూవీ రన్ అవుతున్న ఒకటీ అర థీయేటర్లలో కూడా ప్రదర్శన ఆగిపోవడంతో థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మైత్రి మూవీస్ వారి ఈ యాక్షన్ ఎంటర్టెనర్ భారీ నష్టాన్నే మిగిల్చింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

    ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘అమర్ అక్బర్ ఆంటోనీ' వరల్డ్ వైడ్ రూ. 6.20 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్ష్ రూ. 22 కోట్లకు అమ్మారు. దీంతో దాదాపు రూ. 16 కోట్ల నష్టం ఏర్పడినట్లయింది.

    నైజాంలో నష్టం ఎంత?

    నైజాంలో నష్టం ఎంత?

    నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 5.80 కోట్లకు అమ్మగా... రూ. 1.90 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక్కడ రూ. 4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

    అమర్ అక్బర్ ఆంటోని ఎఫెక్ట్: పవన్‌తో అనుకున్నారు, రవితేజతో కూడా.. చేతులెత్తేసిన మైత్రి!అమర్ అక్బర్ ఆంటోని ఎఫెక్ట్: పవన్‌తో అనుకున్నారు, రవితేజతో కూడా.. చేతులెత్తేసిన మైత్రి!

    సీడెడ్ ఏరియాలో భారీ లాస్

    సీడెడ్ ఏరియాలో భారీ లాస్

    సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 3.30 కోట్లకు అమ్మగా... కేవలం రూ. 89 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో ఇక్కడ కూడా భారీ నష్టం తప్పలేదు.

     ఆంధ్ర ఏరియాలో

    ఆంధ్ర ఏరియాలో

    ఉత్తరాంధ్ర రైట్స్ రూ.2.30 కోట్లకు అమ్మగా రూ. 60 లక్షల షేర్.... గుంటూరు రైట్స్ రూ. 1.80 కోట్లకు అమ్మగా రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరి రైట్స్ రూ. 1.50 కోట్లకు అమ్మగా..రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 1.25 కోట్లకు అమ్మగా రూ. రూ. 32 లక్షలు... కృష్ణ రైట్స్ రూ. 1.45 కోట్లకు అమ్మగా రూ. 30 లక్షలు... నెల్లూరు రైట్స్ రూ. 80 లక్షలకు అమ్మగా రూ. 19 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది.

    రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్

    రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్

    రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 2.20 కోట్లకు అమ్మగా రూ. 50 కోట్ల షేర్, ఓవర్సీస్ రైట్స్ రూ. 1.60 కోట్లకు అమ్మగా రూ. 49 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.

    English summary
    Ravi Teja and Ileana D’Cruz starrer action entertainer Amar Akbar Anthony has earned Rs 6.20 Cr at the Worldwide box office. The movie has declared as disaster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X