Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలియానా రీఎంట్రీ మూవీ పరిస్థితి ఎలా ఉందంటే!
చాలా కాలంగా రవితేజకు సరైన హిట్ లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన శ్రీనువైట్ల చాలా కాలంగా ఒక్క విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆరేళ్లపాటు తెలుగు వెండితెరపై కనిపించని ఇలియానా రీ ఎంట్రీ ఇస్తోంది. రవితేజ ఈ చిత్రంలో మూడు కోణాల్లో నటిస్తున్నాడు. ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచింది. ఒక చిత్రపై మంచి అంచనాలు ఏర్పడడానికి ఇంతకంటే కారణాలు అవసరం లేదు. ప్రేక్షకులు సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆకట్టుకోని కథ, కథనాలతో శ్రీనువైట్ల అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. అమర్ అక్బర్ ఆంటోని తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

డివైడ్ టాక్
అమర్ అక్బర్ ఆంటోని చిత్రానికి తొలి షోనుంచే డివైడ్ టాక్ ప్రారంభమైంది. సినీ క్రిటిక్స్ నుంచి అమర్ అక్బర్ ఆంటోని చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. శ్రీనువైట్ల రొటీన్ కథ కథనాలతో సేఫ్ గేమ్ ఆడారని విమర్శ వినిపించింది. రవితేజ, ఇలియానా నాలుగోసారి జంటగా నటించారు.

తొలిరోజు వసూళ్లు
రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, ఇలియానా క్రేజ్ తో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తొలిరేజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.40 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగింది. పెరుగుతున్న నెగిటివ్ మౌత్ టాక్ తో రాబోవు రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లు రాబట్టగలుగుతుందో చూడాలి. రవితేజ చివరి చిత్రం నేల టికెట్ తొలి రోజు తెలుగు రాష్ట్రలో 3.47 కోట్లు రాబట్టింది.

ఏరియాలవారీగా
అమర్ అక్బర్ ఆంటోని చిత్రం నైజాంలో తొలిరోజు 1. 26 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ లో 46 లక్షలు, ఉత్తరాంధ్రలో 43 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 30, వెస్ట్ గోదావరిలో 20 లక్షలు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా ప్రారంభమైన అమర్ అక్బర్ ఆంటోని చిత్ర వసూళ్లు వీకెండ్ లో ఎలా ఉంటాయో చూడాలి. పైగా నేడు ఈ చిత్రానికి పోటీగా విజయ్ దేవరకొండ టాక్సీవాలా కూడా విడుదలవుతోంది.

ప్రీరిలీజ్ బిజినెస్
అమర్ అక్బర్ ఆంటోని చిత్ర థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్లవరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది. రంగస్థలం వరకు తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న ఈ సంస్థకు ఇటీవల ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి.