»   » బూతు సినిమాకి సెన్సార్ మోక్షం...విడుదలకు సిద్ధం

బూతు సినిమాకి సెన్సార్ మోక్షం...విడుదలకు సిద్ధం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్ని సినిమాల్లో విషయమున్నా లేకపోయినా రిలీజ్ ముందు పిచ్చ హడావిడి చేస్తాయి. ఆ కోవలోకి వచ్చే సినిమా 'అమ్మా నాన్న వూరెళితే'. నిర్మాత ఆత్మహత్యా ప్రయత్నం చేసి మరీ సెన్సార్ యుద్దం చేసిన ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మొదటి నుంచి ఈ చిత్రం బూతు చిత్రంగా ప్రచారమవుతూ వస్తోంది. ఈ బూతు కార్డుతో ఏ మేరకు బిజినెస్ జరిగిందో కానీ, ఓపినింగ్స్ గట్టిగా వస్తాయని భావిస్తున్నారు. ఈ రోజుల్లో చిత్రం విడుదలైన తర్వాత ఆ కోవలో మొదలైన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు.

సిద్ధార్థ్‌ వర్మ, విజయ్‌, మధు, తేజ హీరోలుగా రూపొందిన చిత్రం 'అమ్మా నాన్న వూరెళితే'. శిల్పాస్విత, మనస్విని, సుస్మిత, తనూష నాయికలు. అంజి శ్రీను దర్శకుడు. సోనియా అగర్వాల్‌ ప్రత్యేక గీతంలో నర్తించింది. జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. సినిమా విడుదలకు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ ''నేటి యువత మనోభావాలకు తగ్గ సినిమా ఇది. రివైజింగ్‌ సెన్సార్‌కు వెళ్లడంతో సినిమా కాస్త ఆలస్యమైంది. కమిటీ నుంచి సెన్సార్‌ ధ్రువపత్రం పొందాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

Amma Nanna Oorelithe got A certificate

దర్శకుడు అంజి శ్రీను మాట్లాడుతూ కొన్ని సినిమాలకు చాలా సులువుగా సెన్సార్ దొరుకుతుంది. సెన్సార్ బోర్డు కొంతమంది బడా నిర్మాలకు దాసోహం అయిందేమో అనిపిస్తోంది. సెన్సార్ బోర్డు అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.దీనిపై న్యాయ పోరాటం చేసి అన్ని వివరాలను త్వరలో ఆధారాలతో బయట పెడతాను అన్నారు.

సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ వర్వ, విజయ్,మధు, తేజ, శిల్పాస్విత, మనస్విని, తనూష, సుస్మిత, తదితరులు నటించారు. ఇతర పాత్రల్లో శివకృష్ణ, అపూర్వ, ఎఫ్.ఎమ్ బాబాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కె.వి.రాజు, పాటలు: పోతుల కిరణ్, శ్రీరాం, తపస్వీ, డాన్స్: సుచిత్రా చంద్రబోస్, అమ్మ రాజశేఖర్, వేణుపాల్, కిశోర్, సంగీతం: మున్నాకాశి, ఎడిటింగ్: బుల్‌రెడ్డి, కెమెరా: ఖాదర్, సహ నిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను.

English summary
Jakkula Nageswara Rao, producer of ‘Amma Naanna Oorelithe’ problems are solved as the Censor Board revising committee passed the movie with ‘A’ certificate with some cuts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu