twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆనంత తాండవం ఏమైంది?(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    Ananda Thandavam
    ఈ వారం రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు(శీనుగాడు..మహా ముదురు, ఆనందతాండవం), రెండు స్ట్రైయిట్ చిత్రాలు(పున్నమి నాగు, నేనే ముఖ్యమంత్రినైతే) రిలీజ్ అయ్యాయి. అయితే ఎప్పటిలాగే ఈ నాలుగూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని వారం తిరగకుండా ధియోటర్స్ నుండి తిరుగు ప్రయాణం పెట్టుకున్నాయి. రెండు వారాల క్రితం రిలీజైన బిల్లా చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఉన్నంతలో బి, సి సెంటర్లలో ఏమన్నా కలెక్షన్స్ వస్తాయేమో నని ఆశగా ప్రయాణం పెట్టుకుంది. అలాగే ధనుష్, శ్రియ హీరోయిన్ గా వచ్చిన శీనుగాడు..గతంలో నితిన్ హీరోగా వచ్చిన టక్కరి కి మూల చిత్రం కావటం మరో విశేషం.

    ఇక తమన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ఆనంద తాండవం చిత్రం ఎనభైల్లో ఈ కథతో వచ్చి వుంటే ఏమన్నా రిజల్ట్ ఎక్సపెక్ట్ చేయవచ్చు అంటున్నారు. మరీ పాత వాసనలు తో ఆస్కార్ రవిచంద్రన్ ఫీల్ గుడ్ మూవీ అంటూ హైప్ చేసి అందించిన ఆనందతాండవం తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. శంకర్, మణిరత్నం వంటి మెగా దర్శకులుకు కథ లందించిన సుజాత రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం కావటంతో అంతటా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఎండల్లో ప్రయాణం పెట్టుకుని ఏసీ ధియోటర్లలో దూకిన వారికి కథా, కథన బలం లేని ఈ చిత్రం హాయిగా నిద్ర పట్టించింది.

    ఇవి ప్రక్కన పెడితో పొలిటికల్ సెటైర్ సినిమా అంటూ పబ్లిసిటీ చేసుకుని దిగిన నేనే ముఖ్యమంత్రిని అయితే చిత్రం కథ, కథన లోపంతో చతికలపడింది. నేనే ఫ్లాఫ్ సినిమానైతే అనే ముద్ర వేయించుకుంది. సీనియర్ దర్సకుడు కోదండ రామిరెడ్డి అత్యంత నిర్లక్ష్యంగా చేసిన పున్నమి నాగు చిత్రంని ముమైత్ బికినీ సైతం కాపాడలేకపోయింది. అయితే వీటిన్నటి కీ కలెక్షన్స్ పడిపోవటానికి కారణం ఎలక్షన్స్, ఆర్ధిక మాధ్యం అని ప్రచారం జర్గుతోంది. అదీ ఈ వారం ట్రేడ్ టాక్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X