»   » ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి వసూళ్లే వసూళ్లు... ఇతర భాషల్లోకి రీమేక్!

‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి వసూళ్లే వసూళ్లు... ఇతర భాషల్లోకి రీమేక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాప్సీ, శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ కామెడీ ఫిల్మ్ 'ఆనందో బ్రహ్మ' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

ఈ విషయమై దర్శకుడు మహి రాఘవ్ మాట్లాడుతూ.... 'ఆనందో బ్రహ్మ' చిత్రం సూపర్ హిట్ అయింది. వసూళ్లు కూడా ఊహించినదానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

సౌత్, బాలీవుడ్లో

సౌత్, బాలీవుడ్లో

‘ఆనందో బ్రహ్మ' చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి పలువురు ముందుకొచ్చారని, తమ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది అని మహి రాఘవ్ తెలిపారు.

వసూళ్లే వసూళ్లు

వసూళ్లే వసూళ్లు

ఈ సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చు చాలా తక్కువ. కేవలం ఒక ఇంట్లో తీసిన సినిమా ఇది. సినిమాకు పెట్టిన పెట్టుబడితో పోలిస్తే వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఆనందో బ్రహ్మ ఓపెనింగ్ వీకెండ్ యూఎస్ఏలో $300,000 వసూలు చేయడం గమనార్హం.

కామెడీ, హారర్ అదుర్స్

కామెడీ, హారర్ అదుర్స్

ఈ సినిమా ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేసే కామెడీతో పాటు సెకండాఫ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉండటంతో రెన్సాన్స్ అదిరిపోతోంది.

ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హారర్ కామెడీ

ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హారర్ కామెడీ

2017లో తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ కామెడీ చిత్రంగా ‘ఆనందో బ్రహ్మ' చిత్రం నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 70 ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ వారు ఈచిత్రాన్ని నిర్మించారు.

English summary
Director Mahi Raghav says remake talks have been initiated for the remake of his latest Telugu release "Anando Brahma", a horror comedy which stars Taapsee Pannu in the lead, in multiple languages.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu