Don't Miss!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- News
వైసీపీపై పోరాటంలో చంద్రబాబు కొత్త వ్యూహం - ఢిల్లీ కేంద్రంగా..!!
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Annaatthe కలెక్షన్ల సునామీ.. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృషించిన రజనీ.. 200 కోట్ల వైపు పరుగు
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అన్నాతే చిత్రం రికార్డుల తిరగరాస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. తమిళనాడు, ఓవర్సీస్‌తోపాటు పలు రాష్ట్రాల్లో అన్నాతే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నది. నవంబర్ 4 రిలీజైన ఈ చిత్రం పలు ప్రదేశాల్లో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నది. గత నాలుగు రోజల్లో ఈ చిత్రం ప్రపంచవ్యప్తంగా ఎంత వసూలు చేసిందంటే...

రెగ్యులర్, రొటీన్ కథతోనే..
దర్శకుడు శివ, రజనీకాంత్ కాంబినేషన్‌లో నవంబర్ 4వ తేదీన దీపావళీ కానుకగా రిలీజైన అన్నాతే చిత్రం సినీ విమర్శకుల నుంచి పెద్దగా ప్రశంసలు పొందలేకపోయింది. రొటిన్, రెగ్యులర్ కథ, కథనాలతో ఈ చిత్రం సగటు ప్రేక్షకుడిని కూడా మెప్పించలేకపోయింది. కానీ అభిమానులను మాత్రం థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నది. దాంతో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.

2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా
ఇక అన్నాతే చిత్రం తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తున్నది. ఇప్పటికీ రాష్ట్రంలో ఆల్‌టైమ్ రికార్డును అందుకొన్నది. ఓపెనింగ్ విషయంలో ఇండియాలో 2021లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. 2021లో ప్రపంచంలోనే అత్యధికంగా ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా మరో రికార్డును సొంతం చేసుకొన్నది. అంతేకాకుండా 2021లో తొలి వారాంతంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది.

తమిళనాడులో వసూళ్ల వరద
ఇక తమిళనాడులో అన్నాతే చిత్రం భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. తొలి రోజున రూ.31.92 కోట్లు రాబట్టిన చిత్రం రెండో రోజున కూడా భారీగానే వసూళ్లను సాధించింది. రెండో రోజున రూ.27.15 కోట్లు, మూడో రోజున రూ.21.30 కోట్లు, నాలుగో రోజున రూ.17.86 కోట్లు వసూలు చేసింది. సెలవు దినాలైన శని, ఆదివారాల్లో తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు పోటెత్తడంతో కలెక్షన్ల కాస్త తగ్గినట్టు కనిపించాయి. దాంతో ఓవరాల్‌గా రూ.101.23 కోట్లు నమోదు చేసింది.

తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పెద్దన్న
అలాగే పెద్దన్నగా రిలీజ్ అయిన అన్నాతే చిత్రం తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 4వ రోజున ఈ చిత్రం రూ.52 లక్షల నికర కలెక్షన్లు, రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం మొత్తం నాలుగు రోజుల్లో కలిపి రూ.3.16 కోట్ల నికర కలెక్షన్లు, రూ.5.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఇంకా 10 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

ఇతర రాష్ట్రాల్లో అన్నాతే కలెక్షన్లు
తెలుగు, తమిళ రాష్ట్రాలను మినహాయిస్తే.. కర్ణాటకలో రూ.7.51 కోట్లు నికరంగా, కేరళలో రూ.2.1 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.3 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ.25.4 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 120 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, రూ.174.73 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అన్నాతే చిత్రం కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది. తొలి రోజున రూ.70.19 కోట్ల రూపాయలను సాధిస్తే.. 2వ రోజున రూ.42.63 కోట్లు, మూడో రోజున రూ.33.71 కోట్లు, నాలుగో రోజున రూ.28.20 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.174.73 కోట్లను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది.