twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యంగ్ టైగర్ అరుదైన రికార్డు.. టాలీవుడ్‌లో ఒక్కడే.. అరవింద సమేతతో...

    |

    అరవింద సమేత చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డులతో దూసుకెళ్తున్నాడు. పండుగ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాడు. ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో భారీ కలెక్షన్లను సాధించాడు. వసూళ్ల పరంగా ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం అక్టోబర్ 11 తేదీన రిలీజైన సంగతి తెలిసిందే.

    తొలివారాంతంలోనే రూ.100 కోట్లు

    తొలివారాంతంలోనే రూ.100 కోట్లు

    అరవింద సమేత తొలి ఆట నుంచే భారీ రెస్సాన్స్ మూటగట్టుకొన్నది. ఈ చిత్రం వేగంగా అంటే తొలివారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఎన్టీఆర్ కెరీర్‌లో వంద కోట్ల క్లబ్ చేరిన ఐదో చిత్రంగా అరవింద సమేత రికార్డును క్రియేట్ చేసింది. గతంలో టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ ఈ ఘనతను సాధించాయి.

    100 కోట్ల క్లబ్‌లో ఐదోసారి

    100 కోట్ల క్లబ్‌లో ఐదోసారి

    టాలీవుడ్‌లోనూ, దక్షిణాదిలోనూ వరుసగా ఐదుసార్లు 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక హీరో ఎన్టీఆర్. ఇలాంటి ఫీట్‌ను ఇంత వరకు మరో హీరో సాధించలేదు. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం వారాంతానికి రూ.100 కోట్లు లాగేసింది.

    తెలంగాణ, నైజాంలో

    తెలంగాణ, నైజాంలో

    ఇక వారం రోజుల కలెక్షన్ల వివారాల్లోకి వెళితే.. అరవింద సమేత నైజాంలో రూ. 13,65,90,291 వసూలు చేసింది. సీడెడ్‌లో రూ. 10,42,29,755 కలెక్షన్లను సాధించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.8.4 కోట్లు సాధించింది.

    ఆంధ్రాలో వసూళ్లు

    ఆంధ్రాలో వసూళ్లు

    ఆంధ్రాల్లో చిత్రం మొత్తంగా భారీ వసూళ్లను సాధించింది. కృష్ణా జిల్లాల్లో రూ. 3,46,77,516, గుంటూరులో 5,60,91,535, ఉత్తరాంధ్రలో 6,06,73,821, తూర్పు గోదావరిలో 3,91,46,209, పశ్చిమ గోదావరిలో 3,62,69,236, నెల్లూరులో రూ. 2,16,45,612 వసూళు చేసింది.

    ఓవరాల్‌గా ఎంత?

    ఓవరాల్‌గా ఎంత?

    ఆంధ్రా, తెలంగాణలో కలిపి అరవింద సమేత సుమారు రూ.49 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ.11 కోట్లు రాబట్టింది. అరవింద సమేత రూ.68 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ వారాంతం సెలవులు కావడంతో మరిన్నీ వసూళ్లను రాబట్టే అవకాశం లేకపోలేదు.

    English summary
    Jr NTR-starrer Aravindha Sametha enters the elite club of Rs 100 crore in less than a week of release and becomes his fifth film to do so. Jr NTR’s previous films Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa have all earned a gross collection of more than Rs 100 crore at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X