twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోతమోగిస్తున్న అరవింద సమేత.. తెలుగు రాష్ట్రాల్లో రెండవరోజు కలెక్షన్స్!

    |

    Recommended Video

    Aravindha Sametha Movie 2nd Day Box Office Collections !

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమెత చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాక్షన్ కథలో వీరరాఘవ రెడ్డిగా ఎన్టీఆర్ అద్భుత నటన కనబరిచాడు. త్రివిక్రమ్ దర్శకత్వానికి, మాటల మాయాజాలానికి ఆడియన్స్ మరో మారు ఫిదా అయ్యారు. ఫలితంగా అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు దాదాపు 26 కోట్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రలో వసూళ్లు పిండుకున్న అరవింద సమేత రెండవ రోజు కూడా దూకుడు కొనసాగించింది.

    మాటల మాంత్రికుడి మ్యాజిక్

    మాటల మాంత్రికుడి మ్యాజిక్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ ఫ్యాక్షన్ రోల్ లో చూపించడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫ్యాక్షన్ కథ సరికొత్త రీతిలో తెరకెక్కించారని ప్రశంసలు దక్కుతున్నాయి. రాయలసీమ యాసలో త్రివిక్రమ్ రాసిన మాటలు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ అందించిన ఫైట్స్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.

    నాన్ బాహుబలి రికార్డ్

    నాన్ బాహుబలి రికార్డ్

    ఆంధ్ర, సీడెడ్, నైజాం మాత్రమే కాదు.. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా వీరరాఘవ విధ్వంసం కొసనసాగుతోంది. కలెక్షన్లలో అరవింద సమేత చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేస్తోంది. తొలి రోజు కళ్ళు చెదిరే రీతిలో అరవింద సమేత చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్లకు పైగా షేర్ సాధించిన సంగతి తెలిసిందే.

     2వ రోజు కూడా తగ్గని జోరు

    2వ రోజు కూడా తగ్గని జోరు

    అరవింద సమేత రెండవ రోజు తెలుగురాష్ట్రాల్లో 8 కోట్ల వరకు షేర్ రాబట్టి బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. దీనితో మొత్తం రెండు రోజుల్లో కలపి తెలుగు రాష్ట్రాల షేర్ 34 కోట్లకు చేరింది. దీనితో ఫుల్ రన్ లో భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

     నైజాంలో దూకుడు

    నైజాంలో దూకుడు

    అరవింద సమేతకు నైజాం ఏరియాలో బలమైన వసూళ్లు కొనసాగుతున్నాయి. రెండవ రోజు ముగిసే సమయానికి ఈ ఏరియాలో 8 కోట్ల షేర్ కొల్లగొట్టింది. తొలి రోజు 5.7 కోట్ల షేర్ సాధించగా రెండవ రోజు 2 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.

    ఆంధ్రలో వసూళ్లు

    ఆంధ్రలో వసూళ్లు


    ఆంధ్ర ప్రాంతంలో వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. సీడెడ్ లో రెండరోజు ముగిసే సరికి 7. కోట్ల షేర్ వసూలు కావడం విశేషం. వైజాగ్ లో 4 కోట్లకు పైగా, ఈస్ట్ గోదావరిలో 3.24 కోట్ల షేర్ నమోదు ఐంది. గుంటూరులో 4.82 కోట్లతో దూసుకుపోతోంది.

    ఘనవిజయం దిశగా

    ఘనవిజయం దిశగా


    దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి అరవింద సమేత భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా పూజ పూజా హెగ్డే నటించింది. నాగ బాబు కీలక పాత్రలో నటించారు. జగపతి బాబు విలన్ గా మరో మారు అబ్బురపరిచాడు.

    English summary
    Aravindha Sametha day 2 box office report. Here is the both Telugu states day 2 shares
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X