»   » ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ వీకెండ్.... యూఎస్ బాక్సాఫీసును కుమ్మేశాడు!

‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ వీకెండ్.... యూఎస్ బాక్సాఫీసును కుమ్మేశాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
US Collections Of "Arjun Reddy"

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా.....మంచి కంటెంటు ఉంటే చాలు సినిమాను భారీ హిట్ చేస్తున్నారు యూఎస్ తెలుగు ప్రేక్షకులు. దానికి మరో ఉదాహరణ 'అర్జున్ రెడ్డి' సినిమా. ఈ నెల 25న విడుదలైన ఈచిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

సినిమా విడుదల ముందు భారీ హైప్ ఉండటంతో 'అర్జున్ రెడ్డి' చిత్రానికి యూఎస్ఏలో ప్రీమియర్ షోల రూపంలో భారీ ఓనింగ్స్ వచ్చాయి. యూఎస్ఏ రైట్స్ రూ. 60 లక్షలకు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్ ప్రీమియర్ షోల ద్వారానే తను పెట్టిన మొత్తాన్ని రాబట్టుకున్నాడట.

1 మిలియన్ డాలర్

1 మిలియన్ డాలర్

తాజాగా యూఎస్ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు 1 మిలియన్ డాలర్‌కు చేరువైంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఒక సినిమాకు ఇంత కలెక్షన్ రావడం అసాధ్యం.

ఫస్ట్ వీకెండ్ $950K

ఫస్ట్ వీకెండ్ $950K

‘అర్జున్ రెడ్డి' మూవీ యూఎస్ఏలో పరిమిత సంఖ్యలో స్క్రీన్లలో రిలీజైంది. గురువారం 194k, శుక్రవారం 265k, శనివారం 321k, ఆదివారం 170k వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ఓవరాల్ గా $950k వసూలు చేసింది.

వివేకం కలెక్షన్ డల్

వివేకం కలెక్షన్ డల్

‘అర్జున్ రెడ్డి' తో పాటు అజిత్ నటించిన ‘వివేకం' మూవీ కూడా యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద రిలీజైంది. అయితే ఈ చిత్రానికి ఆదరణ చాలా తక్కువగా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ హాఫ్ మిలియన్ డాలర్ వసూళ్లు మాత్రమే సాధించింది.

అన్ని సినిమాలపై ‘అర్జున్ రెడ్డి’ ఎఫెక్ట్

అన్ని సినిమాలపై ‘అర్జున్ రెడ్డి’ ఎఫెక్ట్

‘అర్జున్ రెడ్డి' మూవీ ఎఫెక్ట్ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ప్రదర్శనలో ఉన్న ఇతర అన్ని సినిమాలపై పడింది. అంతకు ముందు వారం విడుదలైన ‘ఆనందో బ్రహ్మ' గత వీకెండ్ మంచి వసూళ్లు సాధించినప్పటికీ ఈ వీకెండ్ ‘అర్జున్ రెడ్డి' ఎఫెక్టుతో పెద్దగా వసూళ్లు సాధించలేక పోయింది.

English summary
Vijay Devarakonda's Arjun Reddy had completed a Sensational First Weekend Run at the box office backed by ultra positive talk and reviews. So far, the film collected $950k in its opening weekend, though a final count is yet to be made. A movie collecting one million dollars in the opening weekend means it is a huge blockbuster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu