»   »  ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' రిలీజైన రోజు మార్నింగ్ షో నుంచి ఓ రేంజి కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ఈ చిత్రం కొత్త కొత్త రికార్డులు అంతటా క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం హవాకి సీనియర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తమిళ, హిందీ నుంచి భారీ మొత్తాలతో రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతూండటం ఈ చిత్రం సాధించిన పెద్ద రికార్డు గా చెప్తున్నారు. ట్రేడ్ లో చెప్పబడుతున్న ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు 35 కోట్లు వరకూ ఎపి షేర్, 49 కోట్ల వరకూ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ వచ్చిందంటున్నారు. .

ఆ లెక్కలు వివరాలు ఇలా ఏరియా వైజ్...

నైజాం : రూ.13.10 కోట్లు

సీడెడ్‌ : రూ.6.35కోట్లు

కృష్ణా : రూ. 2.42 కోట్లు

గుంటూరు : రూ.3.20 కోట్లు

నెల్లూరు : రూ.1.51 కోట్లు

వెస్ట్ గోదావరి : రూ.2.20 కోట్లు

ఈస్ట్ గోదావరి : రూ.2.62కోట్లు

ఉత్తరాంధ్ర : రూ.3.65 కోట్లు

మొత్తం ఎ.పి షేర్ : 35.05 కోట్లు

కర్ణాటక : రూ.4.01 కోట్లు

తమిళనాడు, ఒరిస్సా, నార్త్ ఇండియా : రూ.1.58 కోట్లు

ఓవర్సీస్(యు.ఎస్, యు.కె., జపాన్, ఆస్ట్రేలియా) రూ.8.60 కోట్లు

మొత్తం వరల్డ్ షేర్ : 49.24 కోట్లు

గమనిక : పైన చెప్పబడ్డ కలెక్షన్స్ మొత్తం అధికారికంగా చెప్పబడుతున్నవి కావు. కేవలం ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి మాత్రమే

ఇక విడుదలకు ముందే శాటిలైట్స్ రైట్స్, ఇతర విషయాల్లో పలు రికార్డులను నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తర్వాత కూడా రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం నెలకొల్పిన తొలి కార్డు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ రికార్డు. తొలిరోజు ఈచిత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వివిధ స్క్రీన్స్ లలో 48 సార్లు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఒకే రోజు ఇన్ని స్క్రీన్లలో ప్రదర్శించలేదని....తెలుస్తోంది. మరో వైపు సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పరిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
‘Atharintiki Daaredhi’ has set a new Telugu cinema record for 1st week share in Andhra Pradesh. As per the figures released by trade sources, the film’s AP share for week 1 is approximately Rs 35 Cr and worldwide share is approximately Rs 49 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu