»   » 'ఆటోనగర్‌ సూర్య' ఆడియో విడుదల తేదీ ఖరారు

'ఆటోనగర్‌ సూర్య' ఆడియో విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. సమంత హీరోయిన్. దేవా కట్టా దర్శకుడు. అచ్చిరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఆడియోని జనవరి 19న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. మొదట జనవరి 16న అనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని మార్చి 19 కి రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడా అని అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఫైనాన్సియల్ సమస్యలతో ఆగి మళ్లీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అచ్చిరెడ్డి ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

నిర్మాత మాట్లాడుతూ ''నాగచైతన్య పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అనూప్‌ చక్కటి స్వరాలందించారు. పాటల్ని త్వరలో విడుదల చేస్తాం''అన్నారు. "ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నాం. నాగచైతన్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్టవుతుంది. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా చక్కని స్వరాలు కూర్చారు. అలాగే రీరికార్డింగ్ చాలా బాగా చేస్తున్నారు. జనవరి 18న వైభవంగా ఆడియో వేడుక జరుపుతున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా సినిమా వచ్చింది'' అని చెప్పారు. '

Autonagar Surya

దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో చెడుని అంతం చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ముందుకు రారు. అలా వచ్చిన యువకుడి జీవితమే మా సినిమా'' అన్నారు.ఆటోనగర్‌ ప్రాంతంలో అతడు ఏం చెప్తే అది జరగాల్సిందే.. కారణం అతడంటే భయం కాదు. ఆ యువకుడి మాటపై గురి అలాంటిది. పేదల పక్షాన నిలబడి ఎవరినైనా... ఎంతటి వారినైనా ఎదిరించే ఆ కుర్రాడి కథే మా సినిమా అంటున్నారు.

. 'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.

English summary

 The audio of Naga Chaitanya’s upcoming film “Autonagar Surya” is going to be launched on January 19. Deva Katta, the director of the film, has confirmed this news. Initially, the makers were planning to release the songs on January 16; however, the event has now been postponed to January 19.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu