»   » అవసరాల శ్రీనివాస్..బూతు యవ్వారం ఆ రోజే బయిటకు

అవసరాల శ్రీనివాస్..బూతు యవ్వారం ఆ రోజే బయిటకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్లాస్ కమిడియన్ గా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత దర్శకుడుగా మారి, ఇదిగో ఇప్పుడు హీరోగా సైతం టర్న్ అయిన అవసరాల శ్రీనివాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అయితే ఇప్పుడాయన ఓ బూతు కథతో హీరోగా మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే అర్దమై ఉంటుంది. మేము ఏ సినిమా గురించి చెప్తున్నామో...

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నవీన్‌ మేడారంను దర్శకుడిగా పరిచయం చేస్తూ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బాగా బిజీ' . ఈ సందర్భంగా... హోళీ కానుకగా బాబు బాగా బిజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రియల్ 13న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ... రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. హిందీలో హంటర్ సినిమా చూసినప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఇందులో అవసరాల శ్రీనివాస్ హీరోగా అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాం. దర్శకుడు నవీన్ మేడారం... అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది.

Avasarala's 'Baabu Baaga Busy' release date locked

అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. హోళీ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలకు తగ్గట్టుగా సురేష్ భార్గవ విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.

ఈ సినిమాకు ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా..... కుమ్ముడే కుమ్ముడు. ఇందులో శ్రీముఖి, మిస్తీ చక్రవర్తి, తేజస్వీ, సుప్రియ హీరోయిన్లు. తేజస్వి మడివాడ, సుప్రియా ఐసోలా, శ్రీముఖి హీరోయన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, ప్రియదర్శి, రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

English summary
Actor cum director Srinivas Avasarala’s adult comedy entertainer, Babu Baga Busy, is all set to hit the screens on April 13th. .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu