Don't Miss!
- News
Sajjala : కోటంరెడ్డి టీడీపీలోకే ? తేల్చేసిన సజ్జల- ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 Collections: అవతార్ పెను సంచలనం.. 13 రోజుల్లో అన్ని వేల కోట్లు.. తెలుగులో 55 లక్షలు వస్తే!
హాలీవుడ్‌లో రూపొందే చిత్రాలకు ఇండియాలో భారీ స్థాయిలో స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో వచ్చే సినిమాలకు మరింత ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. దీనికి నిదర్శనమే ఇటీవలే విడుదలైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. 2009లో వచ్చిన 'అవతార్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఇప్పుడిది ఒక బిలియన్ మార్కు దాటింది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 13 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

టెక్నికల్ వండర్‌గా సీక్వెల్
లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్‌తో అత్యధిక లొకేషన్లలో విడుదల అయింది.
Kajal Aggarwal: భర్తతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. ఏకంగా పెదాలను లాక్ చేసి మరీ!

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అత్యధిక వసూళ్లను రాబడుతోంది.

13వ రోజు తెలుగు వసూళ్లిలా
టెక్నికల్ వ్యాల్యూస్‌తో వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో పయనిస్తోంది. ఇక, రెండో వీకెండ్‌లోనూ సత్తా చాటిన ఈ మూవీ.. 13వ రోజైన బుధవారం కూడా బాగానే రాబట్టింది. ఫలితంగా దీనికి రూ. 2.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
బ్రాలో షాకిచ్చిన డీజే టిల్లు హీరోయిన్: అలా తెగించి మరీ అందాల ఆరబోత

13 రోజుల్లో తెలుగులో ఇలా
13 రోజుల్లో 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 39.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 26.03 కోట్లతో కలిపి రూ. 74.63 కోట్లు గ్రాస్ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 79.45 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 13 రోజుల్లో రూ. 29.45 కోట్లు లాభాలు సాధించింది.

ఇండియా మొత్తం వసూళ్లు
తెలుగులో రూ. 30 కోట్ల లాభాలకు చేరువైన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ప్రతి రోజూ దీనికి ఏవరేజ్‌గా రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతోంది. ఇలా 13 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 284.30 కోట్లు నెట్, రూ. 324.78 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమా 2022లో అత్యధిక కలెక్షన్లు సాధించి రికార్డు సాధించింది.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
జేమ్స్ కామెరాన్ రూపొందించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 13వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 60 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇలా మొత్తంగా 13 రోజుల్లో 1.032 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 8545.63 కోట్లు వసూలు చేసి అదిరిపోయే ఘనతను అందుకుంది.

రికార్డులతో దూసుకుపోతూ
టెక్నికల్ వండర్‌గా అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. అలాగే, ఒక బిలియన్ మార్కును దాటేసి వేగంగా ఈ ఘనత అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ.. మరో రెండు మూడు రోజుల్లోనే 10 వేల కోట్లు మార్కును చేరబోతుంది.