Avatar 2 Collections: వారంలోనే 5 వేల కోట్లు.. అవతార్ మరో సంచలనం.. తెలుగులో ఊహించని రికార్డు

హాలీవుడ్‌లో రూపొందే చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండియాలో ఇలాంటి సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని అత్యధిక కలెక్షన్లను అందుకుంటోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో మూవీలు రికార్డు స్థాయి వసూళ్లతో సత్తా చాటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది ఇటీవలే విడుదలైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఎన్నో అంచనాలతో వచ్చి సత్తా చాటుతోన్న ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' వారం రోజుల రిపోర్టును చూడండి!

మరో లెవెల్‌లో వచ్చిన సీక్వెల్

మరో లెవెల్‌లో వచ్చిన సీక్వెల్

జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో అవతార్‌కు సీక్వెల్‌గా రూపొందిందే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని విడుదల అయింది.

 భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతోంది.

7వ రోజు తెలుగు వసూళ్లిలా

7వ రోజు తెలుగు వసూళ్లిలా

టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. అయితే, 7వ రోజు దీనికి కలెక్షన్లు మరింతగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 1.00 కోట్లతో రూ. 3.20 కోట్లు గ్రాస్, రూ. 1.50 కోట్లు షేర్ వసూలు అయింది.

వారంలో తెలుగులో ఇలా

వారంలో తెలుగులో ఇలా

'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో నైజాంలో రూ. 28.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 18.60 కోట్లతో కలిపి రూ. 57.50 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ. 7.50 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు

విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా తొలి రోజు రూ. 41 కోట్లు, 2వ రోజు రూ. 45 కోట్లు, 3వ రోజు రూ. 43.40 కోట్లు, 4వ రోజు రూ. 14 కోట్లు, 5వ రోజు రూ. 15 కోట్లు, 6వ రోజు రూ. 18 కోట్లు, 7వ రోజు రూ. 14 కోట్లు వచ్చాయి. ఇలా వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. 191.50 కోట్లు నెట్‌తో పాటు రూ. 250.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 7వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 53 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా వారం రోజుల్లో 609.8 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 5053.26 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

నెంబర్ వన్ మూవీగా చరిత్ర

నెంబర్ వన్ మూవీగా చరిత్ర

గతంలో చూడని సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 609.8 మిలియన్ డార్లను వసూలు చేసింది. తద్వారా 2022లో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే 'Doctor Strange in the Multiverse of Madness' 450 మిలియన్ డాలర్ల రికార్డును దాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X