Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Avatar 2 Collections: అవతార్ మరో సంచలన రికార్డు.. 2 వారాల్లో అన్ని వేల కోట్లు.. తెలుగులో మెంటల్ మాస్
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొంది.. ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన చిత్రమే 'అవతార్'. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఊహించని రీతిలో స్పందనను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అనే సినిమాను రూపొందించారు. దీనికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. దీంతో ఇది ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' రెండు వారాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

మరోసారి వచ్చిన అవతార్
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ రూపొందించిన విజువల్ వండర్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్‌తో అత్యధిక లొకేషన్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అత్యధిక వసూళ్లను అందుకుంటోంది.

14వ రోజు తెలుగు వసూళ్లిలా
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇక, రెండో వారంలోనూ సత్తా చాటుతోన్న ఈ మూవీ.. 14వ రోజైన గురువారం కూడా బాగానే రాబట్టింది. ఫలితంగా దీనికి రూ. 2.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

2 వారాల్లో తెలుగులో ఇలా
2 వారాల్లో 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 40.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 26.83 కోట్లతో కలిపి రూ. 76.68 కోట్లు గ్రాస్ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 81.55 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 14 రోజుల్లో రూ. 31.55 కోట్లు లాభాలు సాధించింది.

ఇండియా మొత్తం వసూళ్లు
'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ప్రతి రోజూ దీనికి ఏవరేజ్‌గా రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతూనే ఉంది. ఇలా రెండు వారాల్లోనే ఈ మూవీకి ఇండియా మొత్తంలో రూ. 291.40 కోట్లు నెట్, రూ. 344.78 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమా 2022లో అత్యధిక కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు సాధించింది.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 14వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 60 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇలా మొత్తంగా 2 వారాల్లో 1.1008 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 9115.50 కోట్లు వసూలు చేసి అదిరిపోయే రికార్డు నమోదు చేసింది.

అన్ని కోట్లు.. రెండో స్థానంలో
విజువల్ వండర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. తద్వారా 'గన్ మావెరిక్' తర్వాత ఈ ఏడాది ఎక్కువ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సాధించింది. అలాగే, ఓవరాల్‌గా ఇప్పటికే రూ. 9000 కోట్ల మార్కును దాటేసి మరో ఘనతను కూడా ఈ క్రేజీ మూవీ ఖాతాలో వేసేసుకుంది.