Avatar 2 Collections: 3వ రోజు మాస్ కుమ్ముడు.. 3 వేల కోట్లు ఏంటి సామీ.. ఇక్కడా పెను సంచలనమే

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న దర్శకుల్లో జేమ్స్ కామెరాన్ ఒకరు. ఆయన రూపకల్పనలో వచ్చిన 'అవతార్' ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ రికార్డులను సైతం క్రియేట్ చేసింది. అంతటి భారీ బడ్జెట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిందే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. విడుదలకు ముందు ఊహించని రీతిలో బజ్‌ను ఏర్పరచుకున్న ఈ మూవీకి అనుకున్నట్లుగానే స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 3 రోజుల కలెక్షన్లను మీరే చూడండి!

అత్యధిక బడ్జెట్‌తో అవతార్ 2

అత్యధిక బడ్జెట్‌తో అవతార్ 2


ప్రపంచమే మెచ్చిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా


విజువల్ వండర్‌గా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ అత్యధికంగా థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా 17000 లోకేషన్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

 3వ రోజు తెలుగు వసూళ్లిలా

3వ రోజు తెలుగు వసూళ్లిలా


'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మూడో రోజు ఈ మూవీకి నైజాంలో రూ. 6.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.55 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 4.45 కోట్లతో రూ. 12.70 కోట్లు గ్రాస్, రూ. 7 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

3 రోజులకూ తెలుగులో ఇలా

3 రోజులకూ తెలుగులో ఇలా


హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో భారీ స్పందన దక్కడంతో వసూళ్లు కూడా అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా 3 రోజుల్లో కలిపి దీనికి నైజాంలో రూ. 19.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 12.70 కోట్లతో కలిపి రూ. 37.10 కోట్లు గ్రాస్, రూ. 20 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు


హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి మొదటి రోజు రూ. 41 కోట్లు, రెండో రోజు రూ. 45 కోట్లు, మూడో రోజు రూ. 43.40 కోట్లు వచ్చాయి. ఇలా 3 రోజుల్లో రూ. 129.40 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి. అంతేకాదు, రూ. 151.44 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డులు నమోదు చేసుకుంది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే


జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా వీకెండ్‌లోనే 3500 కోట్లు మైలురాయిని దాటింది. ఇలా మూడు రోజుల్లో 435 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3597.87 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 3448 కోట్లు నెట్‌ను రాబట్టింది.

 పది వేల కోట్లు మార్క్ కూడా

పది వేల కోట్లు మార్క్ కూడా


విజువల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ మూడు రోజుల్లోనే దాదాపు రూ. 3600 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఫుల్ రన్‌లో ఈ చిత్రం దగ్గర దగ్గరగా 10 వేల కోట్ల రూపాయలను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే ఈ చిత్రం ఎన్నో రికార్డులను నమోదు చేసే ఛాన్స్ కూడా ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X