Avatar 2 Closing Collections 2022లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఇండియాలో అవతార్ 2 వసూళ్లు ఎంతంటే?

ప్రపంచ దిగ్గజ సినీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం భారీ అంచనాలతో వచ్చి రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. వాటర్ థిమ్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప విజువల్ అనుభూతిని క్రియేట్ చేసింది. అవతార్ 2 చిత్రంలోని గ్రాఫిక్ వర్క్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్నది. దాంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. డిసెంబర్ 16వ తేదీ, 2022 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇండియాలో ఎంత వసూలు చేసిందంటే?

జేమ్స్ కామెరాన్ వినూత్న సృష్టి

జేమ్స్ కామెరాన్ వినూత్న సృష్టి

చంద్రుడిని పోలిన పండోరా గ్రహాన్ని సృష్టించిన జేమ్స్ కామెరాన్ వెండితెర మీద అద్బుతాలు సృష్టించాడు. అవతార్ 1 చిత్రం ప్రపంచ సినిమాలో ఎవరూ అధిగమించలేని బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేస్తే.. అవతార్ 2 కూడా అదే రేంజ్‌లో రికార్డు వసూళ్లను స్థాపించడానికి బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది.

ఇండియాలో రికార్డు స్క్రీన్లలో రిలీజ్

ఇండియాలో రికార్డు స్క్రీన్లలో రిలీజ్

అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 3800 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఇండియా కాకుండా ఇతర దేశాల్లో 48200 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 వేల స్క్రీన్లలో స్క్రీనింగ్ చేశారు.

5 వారాలపాటు దిగ్విజయంగా జైత్రయాత్ర

5 వారాలపాటు దిగ్విజయంగా జైత్రయాత్ర

ఇండియాలో అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం 5 వారాలపాటు ఇండియాలో దిగ్విజయంగా ప్రదర్శించబడింది. దాదాపు 35 రోజులపాటు భారీగా వసూళ్లు సాధించింది. ఇంకా ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ చిత్రం దాదాపు థియేట్రికల్ రన్ ముగిసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఏపీ, నైజాంలో ఎంత వసూలంటే?

ఏపీ, నైజాంలో ఎంత వసూలంటే?

ఏపీ తెలంగాణలో అవతార్ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. 50 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం మొత్తంగా థియేట్రికల్ రన్‌లో నైజాంలో 51 కోట్లు, సీడెడ్‌లో 12 కోట్లు, ఆంధ్రాలో 37 కోట్ల వసూళ్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాదాపు 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను డిస్టిబ్యూటర్లకు పంచిపెట్టింది.

ఇండియా వైడ్ కలెక్షన్లు ఎంతంటే?

ఇండియా వైడ్ కలెక్షన్లు ఎంతంటే?

ఇక ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ 206 కోట్లు, హిందీ వెర్షన్ 127 కోట్లు, తెలుగు 37 కోట్లు, తమిళ్ 18 కోట్లు, కేరళలో 8 కోట్లు, కర్ణాటకలో 22 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 386 కోట్ల వసూళ్లు సాధించింది. 2022 సంవత్సరంలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అవతార్2 రికార్డులకెక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?

సముద్రం బ్యాక్ డ్రాప్‌తో వాటర్ థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా అవతార్ 2 చిత్రం రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 2 బిలియన్ డాలర్లను వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X