Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చరిత్ర సృష్టించనున్న అవెంజర్స్.. బాలీవుడ్‌ను తలదన్నేలా కలెక్షన్లు.. మూడో రోజుల్లోనే 120 కోట్లు..
హలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్నది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో రికార్డుస్థాయి కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సంవత్సరం విడుదలైన బాలీవుడ్ చిత్రాల కంటే భారీగా వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రిలీజైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

ఫస్ట్ వీకెండ్‌లో
అవెంజర్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ఏప్రిల్ 27న రిలీజైన సంగీతి తెలిసిందే. తొలి వారాంతానికి ఈ చిత్రం 120 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. మూడో రోజైన ఆదివారం ఈ చిత్రం 41.67 కోట్లు వసూలు చేసి మొత్తం 120.90 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

మూడు రోజుల వసూళ్లు
అవెంజర్ ఇన్ఫినిటీ వార్ చిత్రం శుక్రవారం రోజున 31.03 కోట్లు, శనివారం 30.50 కోట్లు, ఆదివారం 41.67 కోట్లు వసూలు చేసింది. తొలివారాంతంలో 94.30 కోట్ల నికర వసూళ్లను సాధించడం దేశీయ బాక్సాఫీస్ వద్ద ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.

పద్మావతి కలెక్షన్లకు మించి
ఈ ఏడాదిలో విడుదలైన బాలీవుడ్ చిత్రాల కలెక్షన్లను పరిశీలిస్తే వివాదాస్పద చిత్రం పద్మావతి తొలి వారాంతానికి 83 కోట్లు వసూలు చేసింది. ఆ వసూళ్లను తలదన్నేలా అవెంజర్స్ కలెక్షన్లు ఉండటం గమనార్హం.

నార్త్ అమెరికాలో కలెక్షన్ల సునామీ
ఇక ఓవర్సీస్ మార్కెట్ చూసుకొంటే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అవెంజర్స్ రికార్డులను తిరగరాస్తున్నది. అమెరికా, కెనడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 250 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ది ఫోర్స్ అవేకెన్స్, స్టార్ వార్స్ సిరీస్ రికార్డులను బ్రేక్ చేసింది.

తొలివారంలోనే రూ.4181 కోట్లు
అవెంజర్స్ ఇన్పినిటీ వార్ తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.4181 కోట్లు (630 మిలియన్ డాలర్లు) వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది.

చైనాలో రికార్డుల మోత
చైనా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల సునామీని సృష్టిస్తున్నది. తొలి వారాంతంలో ఈ చిత్రం 150 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. వారాంతం తర్వాత కూడా కలెక్షన్ల జోరు తగ్గలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై 19వ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా బడ్జెట్ 300 మిలియన్ డాలర్లు.

సూపర్ హీరోల కథ
ప్రతినాయకుడు థానోస్ నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు చేసిన సాహసాలతో కథతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఆంథోని, జో రుస్సో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లట్ జాన్సన్ తదితరులు నటించారు.