దుమ్ము రేపుతున్న ‘అవెంజర్స్’ కలెక్షన్లు.. 150 కోట్ల క్లబ్‌లోకి.. బాలీవుడ్‌కు షాకే..
హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్పినిటీ వార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. వారాంతంలోనే 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. వారాంతం కూడా వసూళ్ల జోష్‌ను కొనసాగించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం 150 కోట్ల క్లబ్‌లోనే చేరే అవకాశం ఉంది.
ఏప్రిల్ 27న రిలీజైన ఈ చిత్రం శుక్ర, శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లు సాధించింది. సోమవారం కూడా అదే ఊపును కొనసాగిస్తూ రూ.20 కోట్లు వసూలు చేసింది. మంగళవారం కూడా ఈ చిత్రం రూ.18 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐదు, ఆరో రోజుల కలెక్షన్ల పరిగణనలోకి తీసుకొంటే ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నది. రెండో వారాంతానికి ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో సునాయాసంగా చేరే ఛాన్స్ కనిపిస్తున్నది.
avengers infinity war avengers infinity war collections anthony russo joe russo అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కలెక్షన్లు ఆంథోని రుస్సో జో రుస్సో


Click it and Unblock the Notifications