అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కలెక్షన్ల మోత.. దంగల్, టైగర్ జిందాహైకి ధీటుగా వసూళ్లు

By Rajababu

Recommended Video

Avengers Infinity War:Overseas Collections

ప్రతిష్టాత్మకంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నది. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం బాలీవుడ్ బడా హీరోల సినిమాకు ధీటుగా ఇండియన్ సినీ మార్కెట్‌లో వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రిలీజ్ రోజున సుమారు రూ.20 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. కానీ ట్రేడ్ పండితుల అంచనాలకు మంచి భారీ రేంజ్‌లో కలెక్షన్లను రాబట్టింది.

 తొలిరోజే కలెక్షన్ల ప్రభంజనం

తొలిరోజే కలెక్షన్ల ప్రభంజనం

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఏప్రిల్ 27న రిలీజైంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రూ.29 కోట్లు రాబట్టింది. శుక్రవారం రాత్రి వరకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగానే వసూలు చేసినట్టు సమాచారం. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన దంగల్, టైగర్ జిందా హై చిత్రాల సాధించిన వసూళ్లను మించి కలెక్షన్ల సాధిస్తున్నది.

దంగల్‌ చిత్రానికి ధీటుగా

దంగల్‌ చిత్రానికి ధీటుగా

బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాలు 4000 థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ అవెంజర్ ఇన్ఫినిటీ వార్ చిత్రం కేవలం 2000 స్క్రీన్లలో మాత్రమే రిలీజైంది. అయితే దంగల్ చిత్రం తొలిరోజున రూ.29.78, టైగర్ జిందాహై రూ.33.75 కోట్లు సాధించాయి. తొలివారాంతానికి ఈ చిత్రం వంద కోట్ల చేరువలో వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా

ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా

ఓవర్సీస్ మార్కెట్‌లో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం ఇప్పటికే 100 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. తొలివారాంతానికి (శుక్ర, శని, ఆది) ఈ చిత్రం 500 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు

 అవెంజర్ రికార్డు ఇదే

అవెంజర్ రికార్డు ఇదే

అవెంజర్ సిరీస్‌లో వచ్చిన ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. దేశంలో ఆ చిత్రం దాదాపు రూ.77 కోట్లు సాధించింది. ఓ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు ఉంది.

 థానోస్‌ నుంచి కాపాడే సూపర్ హీరోలు

థానోస్‌ నుంచి కాపాడే సూపర్ హీరోలు

విలన్ థానోస్ నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు చేసిన సాహసాలతో కథతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఆంథోని, జో రుస్సో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లట్ జాన్సన్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X