అవికాగోర్‌ 'తను నేను' విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్‌: అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాల జంపాల చిత్రాల నిర్మాత రాంమోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'తను నేను'. సంతోష్‌, అవికాగౌర్‌ జంటగా నటిస్తుండగా దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో కన్పించనున్నారు.

ఈ సినిమా నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను వెల్లడించింది.

Avika Gor's Thanu Nenu Release date

అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా వంటి హిట్‌ చిత్రాల నిర్మాత పి రామ్మోహన్‌ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం 'తను నేను'. అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో 'వర్షం' చిత్ర దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు మరో సారి ఇక్కడ చూడవచ్చు.

నవంబర్‌ 11 నుండి 'అఖిల్‌' చిత్రంతో పాటు 'తను నేను' ట్రైలర్‌ కూడా ప్రదర్శిస్తున్నారు. సన్ని ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్‌ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X