For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బాద్‌ షా’ తమిళ ప్రాంతం రైట్స్ ఎంతకంటే...

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్ గా హీరోగా నటించి, ఏప్రియల్ 5న విడుదల అవుతున్న చిత్రం 'బాద్‌ షా'. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు...తమిళనాడులోనూ విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అక్కడ డిస్ట్రిబ్యషన్ రైట్స్ 38 లక్షలకు వెళ్లినట్లు సమాచారం. తమిళనాట.. డబ్బింగ్ లేకుండా తెలుగు వెర్షన్ నే విడుదల చేస్తారు.

  ఇక ఈ చిత్రంలో అనేక హైలెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓ ఐదు నిముషాల పైగా వచ్చే 'సంగీత్' సన్నివేసం సినిమాలో హైలెట్ గా నిలవనుంది అని సమాచారం. ఈ 'సంగీత్' లో ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ పాటలకు స్టెప్స్ వేస్తారని, అవి నందమూరి అభిమానులకు విందులా ఉంటుందని చెప్తున్నారు. సినిమాకు ఉన్న ప్రధాన యు.ఎస్.పిలలో ఈ సన్నివేసం ఒకటని చెప్తున్నారు. ముఖ్యంగా అత్తమడుగు వాగులోన... అనే పాటకు ఎన్టీఆర్ ఓ రేంజిలో స్టెప్స్ వేసి కేక పుట్టించాడని చెప్తున్నారు.

  'దమ్ము' చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్ న టిస్తున్న చిత్రం 'బాద్‌ షా'. శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్.టి.ఆర్‌కు జోడీగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ నేపధ్యంలో వస్తున్న బాద్‌ షాపై ఇటు పరిశ్రమలోను, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు చోటుచేసుకున్నాయి. ఎన్.టి.ఆర్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఎన్.టి.ఆర్ శ్రీనువైట్ల కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు.

  ఈ చిత్రంలో నవదీప్ నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్‌లో కనిపించబోతుండగా, ఆయనతో పాటు సిద్ధార్థ్ కూడా ఓ కీలకమైన గెస్ట్ రోల్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఇందులో ఎన్‌టిఆర్‌కు బ్రదర్ గా కనిపించబోతున్నట్లు తెలిసింది. అంతే గాకుండా తన తాత ఎన్‌టి రామారావు 'జస్టిస్ చౌదరి' గెటప్‌లో కనువిందు చేయనున్నాడు. విశ్రాంతి తర్వాత వచ్చే ఈ ఎపిసోడ్‌లో ఐదు నిమిషాలపాటు తన అభిమా నుల్ని అలరించబోతున్నట్లు సమాచారం. బ్రహ్మా నందం, ఎమ్మెస్ నారాయణ, జయ ప్రకాష్‌రెడ్డిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని
  బాగా నవ్విస్తాయం టున్నారు.

  'బాద్‌ షా' చిత్రానికి సంబంధించి ఆడియో ఇటీవల విడుదలై పాటలకు మంచి స్పందన లభించిందని, థమన్ శ్రోతలను అలరించే స్థాయిలో సంగీతాన్ని అందించారని ఆయన తెలిపారు. యుఎస్‌లో కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్.టి.ఆర్ అభిమానులేకాక అక్కడి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఎన్.టి.ఆర్ లుక్స్, స్టయిల్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్టయ్యే రేంజ్‌లో చిత్రం రూపొందిందని, యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్‌టైనర్ కలగలిపి ఈ బాద్‌ షా ఉంటుందని, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

  దాదాపు యాభై మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్‌వోవర్ చెప్పడం విశేషం. దర్శకుడు శ్రీనువైట్లకి దూకుడు తర్వాత వస్తున్న చిత్రమిది కావడంతో ఆయన ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే 'గబ్బర్‌ సింగ్' తర్వాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తున్న చిత్రమిదే కావడంతో సహజంగానే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి కోనవెంకట్, గోపీమోహన్ మాటలు సమకూరుస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ కెమెరాను అందిస్తున్నారు. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్‌ని నిర్వహిస్తున్నారు.

  English summary
  Craze for NTR, Kajal starrer ‘Badshah’ is not confined to just Andhra Pradesh. According to information the film's Tamilnadu release rights have been bagged for a fancy price of Rs 38 lakhs. Srinu Vytla directed this film which is releasing on 5th April. Thaman scored music for the film which is produced by Bandla Ganesh on Sri Parameswara Arts banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X