»   » బాహుబలి2 క్రేజ్.. వారానికి అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్..కొద్ది నిమిషాలకే హౌస్‌ఫుల్

బాహుబలి2 క్రేజ్.. వారానికి అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్..కొద్ది నిమిషాలకే హౌస్‌ఫుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఊహించినట్టుగానే బాహుబలి2 సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అడ్వాన్స్ బుకింగ్‌పై అద్భుతమైన స్పందన కనిపిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. బాహుబలి2 కన్‌క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ శనివారం (ఏప్రిల్ 22న) ప్రారంభమైంది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే టికెట్లన్ని అమ్ముడు పోవడం గమనార్హం.

తమిళనాడులో యమ క్రేజ్

తమిళనాడులో యమ క్రేజ్

తమిళనాడులో ఎస్పీఐ సినిమాస్ చెన్నైలోనే అతిపెద్ద మల్టీప్లెక్ష్. శనివారం (ఏప్రిల్ 22)న అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తొలి వారానికి టికెట్లు అమ్ముడుపోవడం సినీ వర్గాలను నివ్వెరపరుస్తున్నది. కేరళలో కూడా అడ్వాన్స్ బుకింగ్ అనూహ్య స్పందన లభిస్తున్నది. సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బాహుబలి2 విడుదలపై నెలకొన్న గొడవ ఇటీవల సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఇంకా కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.


నాలుగు రోజుల ముందే ..

నాలుగు రోజుల ముందే ..

బాహుబలి2 విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. టికెట్ల కోసం సినీ ప్రేక్షకుల వేట మొదలైంది. ఒక వారానికి అడ్వాన్స్ బుకింగ్ ముగియడంతో సినీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తొలిరోజు సినిమా చూసేందుకు ప్రేక్షకులు పలు మార్గాల్లో తమతమ ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.


6500 థియేటర్లలో విడుదల

6500 థియేటర్లలో విడుదల

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6500 థియేటర్లలో బాహుబలి2 రిలీజ్ అవుతున్నది. బాహుబలి2పై ఉన్న క్రేజ్‌ను చూస్తే బాక్సాఫీసు రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తొలి వారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి.


సెన్సార్ పూర్తి..

సెన్సార్ పూర్తి..

బాహుబలి2 సినిమా గతవారం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొన్నది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సంచలనం దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్‌కు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.English summary
Baahubali: The Conclusion has received a fantastic response in advance booking in Andhra Pradesh, Telangana, Tamil Nadu and Kerala, say reports. In Tamil Nadu, SPI cinemas, one of the largest multiplexes in Chennai, had opened the pre-booking option on Saturday (April 22). It must be noted that the tickets were sold within few minutes for the first weekend. It is also said that the theatres are filling up fast in Kerala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu